ఇప్పుడు జగన్ తో, ఆ రాష్ట్రంతో మనకేంటమ్మా?: వైఎస్ విజయమ్మ
29-11-2022 Tue 21:20 | Both States
- పోలీసుల అదుపులో షర్మిల
- లోటస్ పాండ్ నివాసంలో విజయమ్మ నిరాహార దీక్ష
- జగన్ స్పందన ఏంటని అడిగిన మీడియా ప్రతినిధి
- నవ్వుతూ బదులిచ్చిన విజయమ్మ

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్ తదనంతర పరిణామాల నేపథ్యంలో వైఎస్ విజయమ్మ లోటస్ పాండ్ నివాసంలో దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జరిగిన పరిణామాలపై జగన్మోహన్ రెడ్డి ఏమైనా మాట్లాడారా... ఎంతైనా సిస్టర్ కదా? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. అందుకు విజయమ్మ స్పందిస్తూ, 'ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో, ఆ రాష్ట్రంతో మనకేంటమ్మా' అంటూ నవ్వుతూ బదులిచ్చారు. ఓ అన్నగా జగన్ మోహన్ రెడ్డి ఏమన్నాడు? అంటూ ఆ రిపోర్టర్ తిరిగి ప్రశ్నించగా, విజయమ్మ మళ్లీ అదే సమాధానం చెప్పారు.
కాగా, తాజా పరిణామాలపై షర్మిల తదుపరి కార్యాచరణను ప్రకటిస్తారని ఆమె పేర్కొన్నారు. తనను షర్మిల వద్దకు పోనివ్వడం లేదు కాబట్టి నిరాహార దీక్షకు దిగానని తెలిపారు.
More Latest News
ఉత్కంఠపోరులో టీమిండియాదే విజయం
7 hours ago

ఎవరెస్ట్ శిఖరంపై అత్యంత అరుదైన జంతువుల గుర్తింపు
8 hours ago

బాలీవుడ్ తార రాఖీ సావంత్ ఇంట తీవ్ర విషాదం
8 hours ago

రెండో టీ20లో టీమిండియా ముందు ఈజీ టార్గెట్
9 hours ago

ఏఎస్సై కాల్పుల్లో గాయపడిన ఒడిశా మంత్రి కన్నుమూత
9 hours ago

మహిళల అండర్-19 వరల్డ్ కప్ విజేత భారత్
10 hours ago

టీమిండియాతో రెండో టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్
10 hours ago

లోకేశ్ యువగళం పాదయాత్రకు కర్ణాటక పోలీసులు
11 hours ago

సీఎం జగన్ రెండ్రోజుల ఢిల్లీ పర్యటన ఖరారు
12 hours ago
