వినాయకుడి విగ్రహం ముందు మోకరిల్లిన శునకం.. వీడియో వైరల్
15-11-2022 Tue 12:08 | Offbeat
- యజమానితో కలిసి గుడికి వెళ్లిన పెంపుడు కుక్క
- పూణే గుడిలో వినాయకుడిపై భక్తి చూపెట్టిన శునకం
- వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన నెటిజన్

సాధారణంగా తమ యజమాని పట్ల శునకాలు ఎంతో ప్రేమను, విశ్వాసాన్ని చూపిస్తాయి. వాళ్లు చెప్పినట్టు చేస్తుంటాయి. అయితే, ఓ శునకానికి దేవుడిపై భక్తి కూడా ఎక్కువైంది. యజమానితో కలిసి గుడికి వెళ్లిన శునకం.. వినాయకుడి విగ్రహం ముందు రెండు కాళ్లు వంచి మోకరిల్లింది. ఈ వీడియో ఇప్పుడు నెట్ లో వైరల్ అయింది. యజమాని విగ్రహం ముందు నిలుచొని దండం పెట్టుకోగా.. కుక్క కూడా భక్తిని చూపెట్టింది.
దీన్ని ఒకరు వీడియో తీసి నెట్ లో పెట్టడంతో అది వైరల్ అయ్యింది. ఈ వీడియో లొకేషన్‌ను గుర్తించలేనప్పటికీ, వీడియోలోని వ్యక్తి విశాల్ అని, ఈ గణపతి ఆలయం పూణేలో ఉందని కామెంట్ల ద్వారా తెలుస్తోంది. పూణేలోని దగ్దుషేత్ గణపతి మందిరం ముంగిట శునకం ఇలా తన భక్తిని ప్రదర్శించిందని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు.
More Latest News
పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..30 మంది దుర్మరణం
56 minutes ago

విదేశాల్లోనూ యూపీఐ సేవలు.. ప్రారంభించిన ఫోన్ పే!
2 hours ago

టర్కీ భూకంప విలయం.. మృత్యుంజయులు ఈ చిన్నారులు!
3 hours ago

ముంబయి బిజినెస్ మేన్ ను పెళ్లాడిన 'నేనింతే' హీరోయిన్
11 hours ago

హైదరాబాదీలను అలరించనున్న డబుల్ డెక్కర్ బస్సులు
12 hours ago

నెల్లూరులో ఆత్మీయ సమావేశం నిర్వహించిన కోటంరెడ్డి
13 hours ago
