-->

'యశోద'లో రోప్స్ .. డూప్స్ లేకుండా ఫైట్లు చేశాను: సమంత

08-11-2022 Tue 16:13 | Entertainment
Samantha Interview

సమంత టైటిల్ రోల్ ను పోషించిన 'యశోద' సినిమా, ఈ నెల 11వ తేదీన విడుదల కానుంది. హరిశంకర్ - హరీశ్ నారాయణ్ నిర్మించిన ఈ సినిమా, సరోగసి నేపథ్యంలో నడుస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో తాజాగా సమంత పాల్గొన్నారు. ఈ సినిమా గురించి సమంత మాట్లాడుతూ .. "ఈ కథ వినగానే నేను షాక్ అయ్యాను .. ఇంత మంచి కథను వదులుకోకూడదనే ఉద్దేశంతో ఓకే చెప్పేశాను. థ్రిల్లర్ జోనర్లో ఇంతకుముందు 'యూ టర్న్' చేసినప్పటికీ, ఆ కథకీ .. 'యశోద'కి ఎలాంటి సంబంధం లేదు" అన్నారు. 

"సాధారణంగా ఏదైనా ఒక కథ నా దగ్గరకి వచ్చినప్పుడు, నేను చేయగలనా లేదా? అనే ఒక భయం నాకు ఉంటుంది. నేను చేయనని కూడా చెప్పేస్తూ ఉంటాను. ఒకసారి కథ ట్రాక్ ఎక్కిన తరువాత చేస్తూ వెళతాను. ఈ సినిమా విషయంలో నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను .. అందువల్లనే టెన్షన్ పడుతున్నాను కూడా. నా సినిమాలను నేను థియేటర్స్ లోనే చూస్తుంటాను. ప్రేక్షకులతో కలిసి సినిమాలు చూడటంలో కలిగే థ్రిల్ వేరు" అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

"నాకు డాన్సులు ఇష్టమా? ఫైట్స్ ఇష్టమా? అని అడిగితే, ఫైట్స్ అనే చెబుతాను. నేను ఫైట్స్ బాగా చేయగలుగుతాను అనే విషయం 'యశోద' సినిమాకి ముందు వరకూ నాకు కూడా తెలియదు. రోప్స్ .. డూప్స్ లేకుండా నేను ఫైట్స్ చేశాను. ఈ సినిమా చివర్లో వచ్చే యాక్షన్ సీన్ నాకు బాగా నచ్చిన సీన్. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వలన ఆ యాక్షన్ సీన్ అద్భుతంగా అనిపిస్తుంది. థియేటర్లో చూసినప్పుడే ఈ సినిమా కిక్ ను ఇస్తుంది" అంటూ చెప్పుకొచ్చారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
మరో రికార్డు బద్దలు కొట్టిన పఠాన్​ చిత్రం
  • ఇప్పటికే రూ. 729 కోట్ల గ్రాస్ కలెక్షన్
  • ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ గ్రాస్ సాధించిన హిందీ చిత్రంగా రికార్డు
  • భారత్ లోనే రూ. 453 కోట్ల వసూళ్లు

ap7am

..ఇది కూడా చదవండి
మరో మెగా హీరోతో సినిమా చేస్తున్నా.. డైరెక్టర్ బాబీ
  • గన్నవరం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన డైరెక్టర్ బాబీ
  • ప్రస్తుతం వాల్తేరు వీరయ్య విజయోత్సవాల్లో ఉన్నట్లు వెల్లడి
  • మరో మెగా హీరోతో కొత్త సినిమా వివరాలు త్వరలోనే చెబుతానన్న డైరెక్టర్ 

..ఇది కూడా చదవండి
‘పఠాన్’ సాధించిన రూ. 700 కోట్ల వసూళ్లలో రూ. కోటి ఇమ్మన్న ఫ్యాన్.. షారుఖ్ ఫన్నీ రిప్లై!
  • ఇప్పటికే రూ. 700 కోట్ల వసూళ్లు సాధించిన ‘పఠాన్’
  • ట్విట్టర్ ద్వారా అభిమానుల ముందుకొచ్చిన షారుఖ్
  • వారు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానమిచ్చిన ‘పఠాన్’


More Latest News
Indians spent crores for new houses in Dubai
Vani Jayaram last rites completed in Chennai with Tamilnadu state honours
Jaggareddy says he never a slave to anyone
GVL comments on Lokesh Yuvagalam Padayatra
Nara Lokesh offers special prayers at Kanipakam Vinayaka Temple
kcr meeting at nanded maharashtra
Gunmen breaks into tears after MLA Kotamreddy returns his security personnel
Australia gets another blow before first test
Huge blast in Pakistans Quetta leaves many injured
Yanamala targets Buggana and CM Jagan
Chandrababu visits K Viswanath house
dastagiri sensational comments on viveka murder case
Teachers held protest to remove CPS
Chennai gangster injured while making crude bomb loses both hands
Pathaan movie being screened illegally in Pakistan
..more