-->

సమంత కెరియర్లో 'యశోద' ప్రత్యేక సినిమా అవుతుందా?

05-11-2022 Sat 16:33 | Entertainment
Samanta Special

ఎలాంటి సినిమా నేపథ్యంలేని ఫ్యామిలీ నుంచి సమంత ఇండస్ట్రీకి వచ్చింది. కెరియర్ ను మొదలెట్టిన తరువాత టాప్ హీరోయిన్స్ రేసులో జాయిన్ కావడానికి ఆమె ఎక్కువగా సమయం తీసుకోలేదు. గ్లామర్ తో పాటు నటనతోను ఆమె ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందం .. అభినయంతో పాటు అదృష్టం కూడా తోడుకావడంతో, తెలుగు .. తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఆమె చక్రం తిప్పేసింది. కొంతకాలం వరకూ హీరోల జోడీగా ఆడిపాడుతూ అల్లరి చేసిన సమంత, ఆ తరువాత లేడీ ఓరియెంటెడ్ పాత్రలపై దృష్టి పెట్టింది. 

అలా సమంత వరుసగా 'యూ టర్న్' ..'ఓ బేబీ' .. 'జాను' సినిమాలు చేస్తూ వెళ్లింది. మొదటి రెండు సినిమాలు కూడా భారీ వసూళ్లను నమోదు చేశాయి. ఆ తరువాత ఆమె గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' చేసింది. ఈ సినిమాకి గ్రాఫిక్స్ కి సంబంధించిన పనులు నడుస్తున్నాయి. వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సమంత సినిమా కోసం అప్పటివరకూ వెయిట్ చేయక తప్పదేమోనని అంతా అనుకున్నారు. కానీ ఈ లోగానే సమంత 'యశోద' సినిమాను పూర్తి చేయడం విశేషం. 

ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై అమాంతంగా అంచనాలు పెంచేసింది. సరోగసి పేరుతో జరుగుతున్న బిజినెస్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. యశోద అనే పాత్రలో సమంత కనిపించనుంది. తన కడుపులో ఒక బిడ్డను మోస్తున్న యశోద, తన చుట్టూ ఏదో జరుగుతుందని గ్రహిస్తుంది. ఆవేదన .. ఆక్రోశం .. భయం .. దుఃఖం .. తప్పనిసరి పరిస్థితుల్లో తిరగబడే యశోద పాత్రలో సమంత ఎక్స్ ప్రెషన్స్ కి ఇప్పటికే పొలోమంటూ ఓట్లు పడిపోయాయి. సమంత కెరియర్లోనే ఈ సినిమా చెప్పుకోదగిన స్థాయిలో నిలుస్తుందనే టాక్ వినిపిస్తోంది. సమంత నటనకు ఇది ఒక గీటురాయి అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  .

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
మరో రికార్డు బద్దలు కొట్టిన పఠాన్​ చిత్రం
  • ఇప్పటికే రూ. 729 కోట్ల గ్రాస్ కలెక్షన్
  • ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ గ్రాస్ సాధించిన హిందీ చిత్రంగా రికార్డు
  • భారత్ లోనే రూ. 453 కోట్ల వసూళ్లు

ap7am

..ఇది కూడా చదవండి
మరో మెగా హీరోతో సినిమా చేస్తున్నా.. డైరెక్టర్ బాబీ
  • గన్నవరం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన డైరెక్టర్ బాబీ
  • ప్రస్తుతం వాల్తేరు వీరయ్య విజయోత్సవాల్లో ఉన్నట్లు వెల్లడి
  • మరో మెగా హీరోతో కొత్త సినిమా వివరాలు త్వరలోనే చెబుతానన్న డైరెక్టర్ 

..ఇది కూడా చదవండి
‘పఠాన్’ సాధించిన రూ. 700 కోట్ల వసూళ్లలో రూ. కోటి ఇమ్మన్న ఫ్యాన్.. షారుఖ్ ఫన్నీ రిప్లై!
  • ఇప్పటికే రూ. 700 కోట్ల వసూళ్లు సాధించిన ‘పఠాన్’
  • ట్విట్టర్ ద్వారా అభిమానుల ముందుకొచ్చిన షారుఖ్
  • వారు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానమిచ్చిన ‘పఠాన్’


More Latest News
Gudivada Amarnath replies to Hariramajogaiah letter
Bopparaju says employees will take further steps if govt not respond
KCR said if BRS wins country will glorify in two years
Indians spent crores for new houses in Dubai
Vani Jayaram last rites completed in Chennai with Tamilnadu state honours
Jaggareddy says he never a slave to anyone
GVL comments on Lokesh Yuvagalam Padayatra
Nara Lokesh offers special prayers at Kanipakam Vinayaka Temple
kcr meeting at nanded maharashtra
Gunmen breaks into tears after MLA Kotamreddy returns his security personnel
Australia gets another blow before first test
Huge blast in Pakistans Quetta leaves many injured
Yanamala targets Buggana and CM Jagan
Chandrababu visits K Viswanath house
dastagiri sensational comments on viveka murder case
..more