రోహిత్ రెడ్డి సహా నలుగురు ఎమ్మెల్యేలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో భద్రత పెంచిన తెలంగాణ ప్రభుత్వం
04-11-2022 Fri 18:07 | Telangana
- రూ.400 కోట్లతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం
- నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర
- ఎమ్మెల్యేల భద్రతపై ఆందోళనలు
- ఎస్కార్ట్ సౌకర్యం కల్పించిన తెలంగాణ ప్రభుత్వం

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రూ.400 కోట్లతో ఎర వేసిన వ్యవహారం తీవ్ర దుమారం రేపడం తెలిసిందే. అయితే, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు ఆ ఆఫర్ ను బట్టబయలు చేశారు. ఈ నేపథ్యంలో నలుగురు ఎమ్మెల్యేల భద్రతపై ఆందోళన నెలకొనడంతో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది.
కొన్నిరోజుల కిందటే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి బుల్లెట్ ప్రూఫ్ వాహనం సమకూర్చిన సర్కారు, తాజాగా మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలకు కూడా భద్రతను పెంచింది. గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డిలకు కూడా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కేటాయించింది. దాంతో పాటు ఎస్కార్ట్ సౌకర్యం కూడా కల్పించింది. వారి నివాసాల వద్ద కూడా భద్రతను పెంచింది.
More Latest News
నేనెవరికీ బానిసను కాదు: జగ్గారెడ్డి
1 hour ago

దేశంలో సమూల మార్పులు తీసుకొస్తాం: సీఎం కేసీఆర్
2 hours ago

పాకిస్థాన్ లో మరోసారి బాంబు పేలుడు
3 hours ago

ఆర్థికశాఖపై పెత్తనమంతా సీఎం జగన్ దే: యనమల
3 hours ago

సీపీఎస్ రద్దుకు సమరశంఖం పూరించిన ఉపాధ్యాయులు
3 hours ago
