సత్తా చాటిన బౌలర్లు... ఐర్లాండ్ పై ఆస్ట్రేలియా ఈజీ విక్టరీ
31-10-2022 Mon 17:20 | Sports
- టీ20 వరల్డ్ కప్ లో నేడు ఆసీస్ వర్సెస్ ఐర్లాండ్
- బ్రిస్బేన్ లో జరిగిన మ్యాచ్
- 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 రన్స్ చేసిన ఆసీస్
- 18.1 ఓవర్లలో 137 పరుగులకు ఐర్లాండ్ ఆలౌట్
- 71 పరుగులతో ఐరిష్ వికెట్ కీపర్ ఒంటరిపోరు

ఐర్లాండ్ తో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో ఆతిథ్య ఆస్ట్రేలియా 42 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసిన ఆసీస్ జట్టు... ఆపై ఐర్లాండ్ ను 18.1 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌట్ చేసింది. ప్యాట్ కమిన్స్, మ్యాక్స్ వెల్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా రెండేసి వికెట్లు సాధించగా, స్టొయినిస్ 1 వికెట్ తీశాడు.
ఐర్లాండ్ ఇన్నింగ్స్ లో వికెట్ కీపర్ లొర్కాన్ టకర్ ఒంటరిపోరాటం చేశాడు. టకర్ 48 బంతుల్లోనే 71 పరుగులు చేశాడు. టకర్ చివరి వరకు క్రీజులో ఉన్నప్పటికీ అతడికి ఇతర బ్యాట్స్ మెన్ నుంచి సహకారం కరవైంది.
కాగా, ఈ విజయంతో ఆస్ట్రేలియా సూపర్-12 గ్రూప్-1 పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి ఎగబాకింది. ఆసీస్ ఇప్పటిదాకా 4 మ్యాచ్ లు ఆడి రెండు విజయాలు నమోదు చేసింది.
More Latest News
బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించాలంటూ గవర్నర్ ను స్వయంగా ఆహ్వానించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి
7 hours ago

వాయుగుండం.. రేపు ఏపీకి వర్ష సూచన
8 hours ago

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై తాజా బులెటిన్ విడుదల
10 hours ago

కడప జిల్లా గండికోటలో కమలహాసన్ సందడి
11 hours ago

త్వరలో పాకిస్థాన్ లో ఎన్నికలు... తానొక్కడే 33 స్థానాల్లో పోటీ చేయాలని ఇమ్రాన్ ఖాన్ సంచలన నిర్ణయం
12 hours ago
