కేటీఆర్ దత్తత తీసుకోవడానికి మునుగోడు ప్రజలు ఏమైనా అనాథలా?: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
18-10-2022 Tue 21:16 | Telangana
- నవంబరు 3న మునుగోడు ఉప ఎన్నికలు
- పోటాపోటీగా ప్రచార పర్వం
- మునుగోడు ప్రజలకు నేనున్నానంటూ రాజగోపాల్ రెడ్డి వెల్లడి

ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించడం తెలిసిందే. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆయనకు మద్దతుగా కేటీఆర్ ఇటీవల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా పైవ్యాఖ్యలు చేశారు.
దీనిపై బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. కేటీఆర్ దత్తత తీసుకోవడానికి మనుగోడు నియోజకవర్గ ప్రజలు ఏమైనా అనాథలా? అని ప్రశ్నించారు. మునుగోడు ప్రజలకు రాజగోపాల్ రెడ్డి ఉన్నాడని స్పష్టం చేశారు. మునుగోడులో టీఆర్ఎస్ కు సరైన నేతలే కరవయ్యారా? అంటే టీఆర్ఎస్ నిలబెట్టిన అభ్యర్థి డమ్మీనా? అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.
More Latest News
పార్టీ మార్పు వార్తలపై స్పందించిన ఈటల రాజేందర్
32 minutes ago

బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించాలంటూ గవర్నర్ ను స్వయంగా ఆహ్వానించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి
10 hours ago

వాయుగుండం.. రేపు ఏపీకి వర్ష సూచన
11 hours ago

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై తాజా బులెటిన్ విడుదల
12 hours ago
