రైతు భరోసా-పీఎం కిసాన్ రెండో విడత నిధులు విడుదల చేసిన సీఎం జగన్
17-10-2022 Mon 14:21 | Andhra
- గత మే నెలలో తొలి విడత నిధుల విడుదల
- నేడు రూ.4 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ
- 50.92 లక్షల మందికి లబ్ది
- నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో కార్యక్రమం
- రూ.2,096.04 కోట్లు విడుదల

వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ రెండో విడత నిధులను సీఎం జగన్ నేడు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జరిగిన ఓ కార్యక్రమంలో విడుదల చేశారు. కంప్యూటర్ బటన్ నొక్కి 50.92 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేశారు. ఈ సందర్భంగా రూ.2,096.04 కోట్ల నిధులను విడుదల చేశారు.
ఏపీలో ఈ పథకం వరుసగా నాలుగో ఏడాది అమలవుతోంది. కాగా, ఈ ఏడాది మే నెలలో తొలివిడతగా రూ.7,500 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసిన ఏపీ ప్రభుత్వం నేడు రెండో విడత సందర్భంగా రూ.4 వేల చొప్పున బదిలీ చేసింది.
ఇక మూడో విడతలో భాగంగా వచ్చే జనవరిలో రూ.2 వేల చొప్పున విడుదల చేయనున్నారు. రైతు భరోసా-పీఎం కిసాన్ లో భాగంగా ఏటా రైతుకు రూ.13,500 మేర సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే.
More Latest News
ఈసారి మేనేజర్ల వంతు.. వేటుకు సిద్ధమైన జుకర్బర్గ్!
23 minutes ago

బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించాలంటూ గవర్నర్ ను స్వయంగా ఆహ్వానించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి
8 hours ago

వాయుగుండం.. రేపు ఏపీకి వర్ష సూచన
9 hours ago

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై తాజా బులెటిన్ విడుదల
11 hours ago

కడప జిల్లా గండికోటలో కమలహాసన్ సందడి
12 hours ago
