తిరుమలలో గుంటూరు భక్తులపై తమిళనాడు భక్తుల దాడి
11-10-2022 Tue 10:59 | Andhra
- క్యూ లైన్లో చోటుచేసుకున్న ఘర్షణ
- టాయ్ లెట్ కు దారి ఇవ్వాలన్న గుంటూరు భక్తులు
- మాటామాటా పెరిగి కొట్టుకునేంత వరకు వెళ్లిన వైనం

పవిత్ర ఆథ్యాత్మిక క్షేత్రం తిరుమలలో ఏపీ, తమిళనాడు భక్తుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఇద్దరు భక్తులు గాయపడ్డారు. దర్శనం క్యూ లైన్లో ఈ ఘటన సంభవించింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం గుంటూరు నుంచి వచ్చిన భక్తులపై తమిళనాడు భక్తులు దాడి చేశారు. టాయ్ లెట్ కు వెళ్లేందుకు దారి ఇవ్వాలంటూ తమిళనాడు భక్తులను గుంటూరు భక్తులు కోరారు.
ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తోపులాటతో ప్రారంభమైన ఘర్షణ చివరకు క్యూ లైన్లోనే కొట్టుకునేంత వరకు వెళ్లింది. పక్కనున్న వారు ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ తమిళనాడు భక్తులు ఆగలేదు. ఈ గొడవలో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటనపై టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు.
More Latest News
ఇలియానాకు ఏమయిందో వివరించిన ఆమె తల్లి
4 minutes ago

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు జాక్‌పాట్!
18 minutes ago

ఫ్లోరిడాలో దుండగుల కాల్పులు.. పదిమందికి గాయాలు!
49 minutes ago

బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించాలంటూ గవర్నర్ ను స్వయంగా ఆహ్వానించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి
11 hours ago

వాయుగుండం.. రేపు ఏపీకి వర్ష సూచన
12 hours ago
