దూసుకుపోయిన మార్కెట్లు.. 13 వందల పాయింట్ల వరకు లాభపడ్డ సెన్సెక్స్
04-10-2022 Tue 15:56 | Business
- 1,277 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 386 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- పన్ను తగ్గింపు ప్రణాళికను బ్రిటన్ వెనక్కి తీసుకోవడంతో మార్కెట్లలో జోష్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు రాకెట్ లా దూసుకుపోయాయి. బ్రిటన్ గత వారం ప్రకటించిన పన్ను తగ్గింపు ప్రణాళికను వెనక్కి తీసుకోవడం మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,277 పాయింట్లు లాభపడి 58,065కి ఎగబాకింది. నిఫ్టీ 386 పాయింట్లు పుంజుకుని 17,274కి పెరిగింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (5.29%), బజాజ్ ఫైనాన్స్ (4.23%), టీసీఎస్ (3.58%), బజాజ్ ఫిన్ సర్వ్ (3.37%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.98%).
బీఎస్ఈ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.07%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-0.18%).
More Latest News
నారా లోకేశ్ 6వ రోజు యువగళం పాదయాత్ర.. హైలైట్స్
6 minutes ago

కేంద్ర బడ్జెట్ పై చిదంబరం తీవ్ర విమర్శలు
1 hour ago

యూత్ ను ఆకట్టుకునే 'శశివదనే' సాంగ్!
3 hours ago
