/

ఎల‌న్ మ‌స్క్‌, జెలెన్ స్కీ మ‌ధ్య ట్వీట్ల వార్‌

04-10-2022 Tue 10:56
Elon Musk has peace plan for Ukraine  Zelensky his officials are not pleased

ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడిని ముగించే విష‌యంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌లు సూచ‌న‌లు చేసిన టెస్లా అధినేత ఎలన్ మ‌స్క్ ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ, ఆ దేశ అధికారుల‌తో తిట్లు తిన్నారు. ఈ విష‌యంలో మ‌స్క్‌, ఉక్రెయిన్ అధికారుల మ‌ధ్య సోష‌ల్ మీడియాలో అసహ్య‌క‌ర‌మైన వాగ్వాదం న‌డిచింది. గత వారం రష్యా ఆక్ర‌మించుకున్న నాలుగు ప్రాంతాల్లో ఐక్య‌రాజ్య‌స‌మితి పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని మ‌స్క్ ట్వీట్ చేశారు. 1783 నుంచి క్రిమియా అధికారికంగా రష్యాలో భాగమని, క్రిమియాకు నీటి సరఫరాకు హామీ ఇవ్వాలని.. ఉక్రెయిన్ తటస్థంగా ఉండాలని అన్నారు. ఈ విష‌యంపై తన ట్విట్ట‌ర్ ఖాతాలో పోల్ కూడా నిర్వ‌హించారు.

ఇది ఉక్రెయిన్ల‌కు రుచించ‌లేదు. స్వ‌యంగా ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ.. మ‌స్క్‌కు కౌంట‌ర్ ఇచ్చారు. "మీకు ఏ ఎల‌న్ మ‌స్క్‌ అంటే ఎక్కువ ఇష్టం?” అంటూ పోల్ నిర్వ‌హించారు. ఉక్రెయిన్‌కు మద్దతు ఇచ్చేవాడు అంటూ ఒక ఆప్షన్..  రష్యాకు మద్దతు ఇచ్చేవాడు అంటూ రెండో ఆప్ష‌న్ ఇచ్చారు. జర్మనీలోని కీవ్ రాయబారి ఆండ్రీ మెల్నిక్.. బూతు ప‌దాన్ని వాడి మ‌స్క్‌కు ఇదే త‌న దౌత్య‌ప‌ర స‌మాధానం అని ట్వీట్ చేశారు. 

త‌న ట్వీట్‌పై అన్ని వైపుల నుంచి విమ‌ర్శ‌లు రావ‌డంతో మ‌స్క్ వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఉక్రెయిన్‌పై ర‌ష్యా త‌న పూర్తి సైన్యాన్ని మోహ‌రించే అవ‌కాశం ఉంద‌ని, ఇది పూర్తి యుద్ధానికి దారి తీస్తుందన్నారు. రష్యాకు పెద్ద జనాభా ఉంది కాబ‌ట్టి రెండు వైపులా భారీ ప్రాణ న‌ష్టం జ‌ర‌గవ‌చ్చ‌న్నారు. "మొత్తం యుద్ధంలో ఉక్రెయిన్ విజయం అసంభవం. మీకు ఉక్రెయిన్ ప్రజల పట్ల శ్రద్ధ ఉంటే శాంతిని కోరండి” అని మస్క్‌ ట్విట్ చేశారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
నా కొడుకు బ్రెయిన్ లో ఈ చిప్ ను అమర్చుతా: ఎలాన్ మస్క్
  • న్యూరాలింక్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన మస్క్
  • శరీరంలో చిప్స్ పెట్టేందుకు ప్రయోగాలు
  • ప్రయోగాలు విజయవంతం అవుతాయనే ధీమాలో మస్క్

ap7am

..ఇది కూడా చదవండి
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాల జాబితా విడుదల!
  • ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలుగా న్యూయార్క్, సింగపూర్
  • గతేడాది మొదటి ర్యాంకుల్లో ఉన్న టెల్ అవీవ్ కు మూడో స్థానం
  • చిట్ట చివరన డమాస్కస్, ట్రిపోలి

..ఇది కూడా చదవండి
చమురు విషయంలో పాకిస్థాన్ కు షాకిచ్చిన రష్యా
  • భారత్ కు డిస్కౌంట్ ధరకు చమురును సరఫరా చేస్తున్న రష్యా
  • తమకు కూడా తక్కువ ధరకు సప్లయ్ చేయాలని కోరిన పాకిస్థాన్
  • పాక్ విన్నపాన్ని తిరస్కరించిన రష్యా


More Latest News
Will put chip in my sons brain says Elon Musk
Team India takes on Bangladesh in 1st ODI
Dhulipalla Narendra press meet
OYO to terminate 600 employees
Veera Simha Reddy Movie Release Dateb Confirmed
Revanth Reddy said they have doubts over CBI notice to Kalvakuntla Kavitha
Vijayasai says investment of Amara Raja in Telangana shows the opportunism of TDP leaders
Vijaya Chamundeshwary Interview
No G is greater than mathaji and pithaji says Mukesh Ambani
Chandrababu slams take a dig at AP govt over Amararaja issue
Sonakshi clarifies that she has NOT signed a Telugu project
HIT 2 Movie BlockBuster Celabrations
Ricky Ponting feeling well now and continues commentary
3 CMs are behind liquor scam
Gudivada Amarnath condemns remarks over Amararaja issue
..more