/

పాదయాత్ర మొదలు పెట్టీపెట్టగానే పీకేకు షాక్.. జనం లేక వెలవెలబోయిన సభ

04-10-2022 Tue 06:50
Set Back To Poll strategist Prashant Kishore on very first day

ఎన్నికల వ్యూహాల్లో ఆరితేరిన ప్రశాంత్ కిశోర్ (పీకే) తన విషయంలో మాత్రం ప్రజలను ఆకర్షించలేకపోతున్నారు. తన వ్యూహ రచనతో ఎన్నో రాష్ట్రాల్లో తాను పనిచేసిన పార్టీలను అందలం ఎక్కించిన పీకే.. తన వరకు వచ్చే సరికి ఏం చేయలేకపోతున్నారనే భావన వ్యక్తమవుతోంది. మార్పు కోసం అంటూ సొంతంగా రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకున్న ఆయన 3,500 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు ఆదివారం శ్రీకారం చుట్టారు.

యాత్ర చేపట్టిన తొలి రోజే ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమ చంపారణ్ జిల్లా బేతియాలో నిర్వహించిన సభకు పట్టుమని పదిమంది కూడా హాజరు కాకపోవడంతో అది కాస్తా వెలవెలబోయింది. సభా ప్రాంగణం మొత్తం బోసిపోయి కనిపించింది. స్థానికులు కూడా పీకే సభపై పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఫలితంగా ఆయన వెంట నడిచిన కొద్దిమంది మాత్రమే కనిపించారు. కాగా, పీకే పాదయాత్ర 12-15 నెలలపాటు కొనసాగుతుంది. రాష్ట్రంలోని మొత్తం 38 జిల్లాలను ఈ పాదయాత్రలో కవర్ చేస్తారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రవీబా ఆధిక్యం..
  • జామ్ నగర్ నార్త్ నుంచి బీజేపీ తరఫున బరిలో నిలిచిన రవీబా
  • ఘట్లోబాలో సీఎం భూపేంద్ర పాటిల్ లీడ్
  • మోర్బీలో బీజేపీ అభ్యర్థి ఆధిక్యం.. ఎన్నికలలో ప్రభావం చూపని బ్రిడ్జి ప్రమాద ఘటన
  • మెయిన్ పురి బైపోల్ ఫలితాల్లో దూసుకుపోతున్న డింపుల్ యాదవ్

ap7am

..ఇది కూడా చదవండి
కాంగ్రెస్ ఓడిపోతుండటానికి కారణం ఇదే: హార్దిక్ పటేల్
  • 150కి పైగా స్థానాల్లో లీడ్ లో ఉన్న బీజేపీ
  • కాంగ్రెస్ పార్టీకి విజన్ లేదన్న హార్దిక్ పటేల్
  • వీరంగామ్ స్థానంలో లీడ్ లో ఉన్న హార్దిక్

..ఇది కూడా చదవండి
గుజరాత్ లో రికార్డు స్థాయి విజయం దిశగా బీజేపీ.. పార్టీ కార్యాలయం వద్ద మొదలైన సంబరాలు
  • 182 స్థానాలకు గాను 152 స్థానాల్లో బీజేపీ ముందంజ
  • 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్
  • స్వీట్లు పంచుకుంటున్న బీజేపీ శ్రేణులు


More Latest News
Rivaba jadeja leading in jamnagar north
Congress has no vision says BJP leader Hardhik patel
Want to hide from security cameras Chinese students have come up with an invisibility cloak
Celbration at Gujarat BJP office
Tomorrow OTT Release Movies
Bjp going to get huge majority in Gujarat mixed results in Himachal pradesh
Allu Arjun Rashmika Mandanna Srivalli from Pushpa finds a place in Googles Top Songs
Vedantu sacks 385 employees
Bigg Boss 6  Update
Basara Online Aksharabhyasam Tickets Prices out
Salman Khan and Pooja Hegde in love
Congress plans to shift Himachal MLAs to Rajasthan
Only corruption prevailing in TTD says Ramana Dikshitulu
Annavaram Devasthanam Anna prasadam served in steel plates from today
Mahesh Babu enters food business
..more