/

సినీ నటుడు మహేశ్ బాబు ఇంట్లో చోరీకి వచ్చి.. గోడదూకి తీవ్రంగా గాయపడిన దొంగ

29-09-2022 Thu 07:26

టాలీవుడ్ ప్రముఖ నటుడు మహేశ్ బాబు ఇంట్లో చోరీ కోసం గోడ దూకిన ఓ దొంగ తీవ్ర గాయాలతో కాపలాదారుల చేతికి చిక్కాడు. మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో జరిగిందీ ఘటన. జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 81లో నివసిస్తున్న మహేశ్ బాబు ఇంటికి కన్నం వేయాలని భావించిన ఓ దొంగ మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో ప్రహరీ దూకి లోపలికి ప్రవేశించాలని అనుకున్నాడు. 

అనుకున్నట్టే  గోడ ఎక్కి కిందికి దూకాడు. అయితే, అది చాలా ఎత్తుగా ఉండడంతో కిందపడిన దొంగ తీవ్రంగా గాయపడ్డాడు. మరోవైపు, పెద్ద శబ్దం రావడంతో కాపలాకాస్తున్న సెక్యూరిటీ గార్డులు అక్కడికి వెళ్లి చూశారు. అక్కడ ఓ వ్యక్తి గాయాలతో పడి ఉండడంతో పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు.

అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించారు. అతడి పేరు కృష్ణ (30) అని, మూడు రోజుల క్రితం ఒడిశా నుంచి వచ్చి ఓ నర్సరీ వద్ద ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు. 30 అడుగుల ఎత్తైన గోడ పైనుంచి దూకడంతో తీవ్రంగా గాయపడిన అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. కాగా, ఘటన జరిగినప్పుడు మహేశ్ బాబు ఇంట్లో లేరు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
ఇండస్ట్రీలో ఆ నలుగురు గురించి సూటిగా ప్రశ్నించిన బాలయ్య!
 • 'అన్ స్టాపబుల్ 2'లో స్టార్ ప్రొడ్యూసర్లు 
 • థియేటర్ల నిర్వహణ ఓనర్లకు భారంగా మారిందన్న అల్లు అరవింద్
 • ఆ సమయంలో వాటిని తాము తీసుకోవడం జరిగిందని వెల్లడి 
 • తమ వెనుక మరో 14 మంది ఉన్నారని వ్యాఖ్య 
 • తెలుగు సినిమాను బ్రతికించుకుంటున్నామని వివరణ   

ap7am

..ఇది కూడా చదవండి
అయితే డాన్సులు చిరంజీవికి ఇచ్చి, ఫైట్లు నాకు ఇవ్వాల్సిందే!: చిరంజీవి కాంబోలో సినిమాపై బాలకృష్ణ
 • 'అన్ స్టాపబుల్ 2' వేదికపై అతిరథమహారథులు 
 • నిర్మాతలుగా అల్లు అరవింద్ - సురేశ్ బాబు హాజరు 
 • వేదికపై సందడి చేసిన రాఘవేంద్రరావు - కోదండరామిరెడ్డి
 • ప్రశ్నలు చాలా సూటిగా ఉంటాయంటూ ముందే చెప్పిన బాలయ్య

..ఇది కూడా చదవండి
చూస్తుండగానే సత్యదేవ్ ఎదిగిపోతున్నాడు: అడివి శేష్
 • సత్యదేవ్ హీరోగా 'గుర్తుందా శీతాకాలం'
 • ఆయన సరసన అలరించనున్న ముగ్గురు భామలు
 • ప్రత్యేకమైన ఆకర్షణగా కాలభైరవ బాణీలు 
 • ఈ నెల 9వ తేదీన సినిమా విడుదల 


More Latest News
Unstoppable 2 Update
Himanta Biswa counter to Badruddin Ajmal
This Stadium In Qatar Has Been Built Using 974 Recycled Shipping Containers
Goblin Mode is Oxford English Dictionarys word of the year 2022
 PepsiCo to cut hundreds of jobs as economic pain grows
Unstoppable 2 Update
Nara Lokesh challenge to Jagan
Consent Of Minor Is Not Consent says delhi Court
All 11 England players surround Pakistan batters in Rawalpindi Test
IT raids in Vallabhaneni Vamsi and Devineni Avinash houses
Brazil are dreaming of sixth World Cup title
Cyclone Mandous To Form Over Bay Of Bengal
Software engineer killed his lover in Guntur Dist
Telangana Govt decided to give emcet coaching to govt inter students
North Korea fires over 100 artillery rounds in military drill Says South Korea
..more