/

అటార్నీ జ‌న‌ర‌ల్‌గా ఆర్‌.వెంక‌ట‌ర‌మ‌ణి నియామ‌కం

28-09-2022 Wed 21:33
Senior advocate R Venkataramani has been appointed as the new Attorney General

భార‌త అటార్నీ జ‌న‌ర‌ల్ (ఏజీఐ)గా సుప్రీంకోర్టు సీనియ‌ర్ న్యాయ‌వాది ఆర్‌.వెంక‌ట‌ర‌మ‌ణి నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌తిపాద‌న‌ల‌కు రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రప‌తి ఆమోదంతో అటార్నీ జ‌న‌ర‌ల్‌గా ఆర్‌.వెంక‌ట‌ర‌మ‌ణిని నియమిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం బుధ‌వారం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. 

ప్ర‌స్తుతం భారత అటార్నీ జ‌న‌ర‌ల్‌గా కేకే వేణుగోపాల్ కొన‌సాగుతున్నారు. 2017లో ఈ ప‌ద‌విలో నియ‌మితులైన వేణుగోపాల్ స‌ర్వీసును 2020లో నాటి భార‌త రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ మ‌రోమారు పొడిగించారు. వేణుగోపాల్ ప‌ద‌వీ కాలం ముగుస్తున్న నేప‌థ్యంలో సుప్రీంకోర్టు సీనియ‌ర్ న్యాయ‌వాదిగా ఉన్న ముకుల్ రోహ‌త్గీని ఆ ప‌ద‌విలో నియ‌మించేందుకు కేంద్రం సిద్ధం కాగా... రోహత్గీ ఆ ప్ర‌తిపాద‌న‌ను తిర‌స్క‌రించారు. దీంతో అటార్నీ జ‌న‌ర‌ల్‌గా ఆర్‌.వెంక‌ట‌ర‌మ‌ణిని నియ‌మిస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది.

వెంకటరమణికి న్యాయవాదిగా 40 సంవత్సరాలకు పైగా అపారమైన అనుభవం ఉంది. వెంకటరమణి లా కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క మాజీ సభ్యుడు కూడా. ఆయన 1977 జూలైలో తమిళనాడు బార్ కౌన్సిల్ లో చేరారు.  1997 లో సుప్రీంకోర్టు ఆయనను సీనియర్ న్యాయవాదిగా నియమించింది.  బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీతో కూడా ఆయన అనుబంధం కలిగి ఉన్నారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
మైనర్ అంగీకరించినా సరే.. అది అత్యాచారమే!: రేప్ కేసు విచారణలో ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానం
  • మైనార్ తీసుకునే నిర్ణయాలు చెల్లబోవన్న హైకోర్టు
  • ఇంట్లోంచి వెళ్లిపోయి మరో యువకుడితో కలిసి ఉన్న యూపీ అమ్మాయి
  • ఆ యువకుడికి అప్పటికే పెళ్లయిందని కోర్టుకు చెప్పిన పోలీసులు
  • అమ్మాయి ఇష్టంతోనే ఇద్దరూ కలిసి ఉన్నారంటూ నిందితుడి లాయర్ వాదన

ap7am

..ఇది కూడా చదవండి
తుపానుగా మారనున్న అల్పపీడనం.. ‘మాండస్’గా పేరుపెట్టిన యూఏఈ
  • దక్షిణ అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం
  • నేడు వాయుగుండంగా, తుపానుగా మారనున్న వైనం
  • తీర ప్రాంతాల్లో విరుచుకుపడనున్న వానలు
  • జాలర్లు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు

..ఇది కూడా చదవండి
ఢిల్లీలో ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశం... హాజరైన సీఎం జగన్, చంద్రబాబు
  • భారత్ కు జీ-20 అధ్యక్ష బాధ్యతలు
  • వచ్చే ఏడాది భారత్ లో జీ-20 శిఖరాగ్ర సమావేశం
  • నేడు సన్నాహక సదస్సు.. హాజరైన కేంద్ర మంత్రులు
  • హాజరైన పలువురు సీఎంలు, పార్టీల అధినేతలు


More Latest News
Goblin Mode is Oxford English Dictionarys word of the year 2022
 PepsiCo to cut hundreds of jobs as economic pain grows
Unstoppable 2 Update
Nara Lokesh challenge to Jagan
Consent Of Minor Is Not Consent says delhi Court
All 11 England players surround Pakistan batters in Rawalpindi Test
IT raids in Vallabhaneni Vamsi and Devineni Avinash houses
Brazil are dreaming of sixth World Cup title
Cyclone Mandous To Form Over Bay Of Bengal
Software engineer killed his lover in Guntur Dist
Telangana Govt decided to give emcet coaching to govt inter students
North Korea fires over 100 artillery rounds in military drill Says South Korea
Man Attacked in Secunderabad and Robbed 14 tolas gold jewellery
Gurthunda Seetakalam Pre Release Event
Gurthunda Seetakalam Pre Release Event
..more