/

తెలుగు ప్రేక్షకులను 'పొన్నియిన్ సెల్వన్' థియేటర్లకు రప్పిస్తుందా?

26-09-2022 Mon 15:25
Ponniyin Selven Special

సౌత్ నుంచి మరో భారీ చిత్రం ప్రపంచపటాన్ని ఆక్రమించడానికి సిద్ధమవుతోంది ... ఆ సినిమా పేరే 'పొన్నియిన్ సెల్వన్'. తమిళంలో కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. రికార్డు స్థాయిలో అమ్ముడైన నవల ఇది. ఈ నవలను సినిమాగా చేయడానికి ఎంజీఆర్ ఎంతగానో ప్రయత్నించినా కుదరలేదు. మణిరత్నమే రెండుసార్లు విఫలమై .. మూడోసారి ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించగలిగారు. ఆ కథలోని భారీతనం .. స్టార్స్ డేట్లు .. వాళ్ల పారితోషికాలు.. అన్నీ ఎక్కువే. 

ఈ కథ 1000 సంవత్సరాల క్రితం నాటిది. 'రాజ రాజ చోళుడు' ఒకసారి కావేరీ నది కారణంగా బ్రతికి బయటపడ్డాడట. కావేరి నదిని 'పొన్ని' అంటారు .. సెల్వన్ అంటే తమిళంలో కుమారుడు అని అర్థం.  అందువల్లనే ఆయనను అందరూ 'పొన్నియిన్ సెల్వన్' అని పిలిచేవారు. ఈ సినిమాలో ప్రధానమైనవిగా ఓ 15 పాత్రలు కనిపిస్తాయి. ప్రతి పాత్రకు ప్రత్యేకత .. విశిష్టత కనిపిస్తాయి. చోళరాజుల .. పాండ్య రాజుల మధ్య జరిగే వ్యూహాలే ఈ సినిమా. 

ఈ సినిమాను ఇతర భాషలతో పాటు తెలుగులోనూ ఈ నెల 30న రిలీజ్ చేస్తున్నారు. దిల్ రాజు తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకుని వస్తున్నారు. ఇటీవల ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది కూడా. కానీ రిలీజ్ డేట్ మరింత దగ్గర పడుతుండగా కనిపించవలసిన హడావిడి మాత్రం కనిపించడం లేదు. ప్రస్తుతం చేస్తున్న సందడి సరిపోదనిపిస్తోంది. ప్రధానమైన పాత్రధారులంతా తెలుగువారికి పరిచయమున్నవారే. పైగా మణిరత్నం సినిమాలను ఇష్టపడేవారు సంఖ్య కూడా ఇక్కడ ఎక్కువే. మల్టీప్లెక్స్ లలో అన్నీ కలుపుకుని 330 రూపాయలు .. సింగిల్ స్క్రీన్ లలో 175 రూపాయలుగా టిక్కెట్ల రేట్లను నిర్ణయించారట. మరి ఆ రేటును దాటుకుని థియేటర్స్ కి ప్రేక్షకులు వచ్చేలా ఈ సినిమా చేయగలుగుతుందేమో చూడాలి.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
బాలకృష్ణతో అంతర్జాతీయ స్థాయిలో 'రామానుజాచార్య' సినిమా
  • ఒక అంతర్జాతీయ సంస్థ, రవి కొట్టారకరతో కలిసి నిర్మిస్తున్నామన్న సి.కల్యాణ్  
  • చినజీయర్ స్వామి సహకారం వుందని వెల్లడి
  • ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయన్న కల్యాణ్

ap7am

..ఇది కూడా చదవండి
‘ఫ్యామిలీతో విహార యాత్ర.. హీరోయిన్‌తో వీరయ్య యాత్ర’ అంటూ మెగాస్టార్ డబుల్ ధమాకా
  • వాల్తేరు వీరయ్య పాటల చిత్రీకరణకు యూరప్ వెళ్లిన చిత్ర యూనిట్
  • తన వెంట కుటుంబ సభ్యులను  తీసుకెళ్లిన మెగాస్టార్
  • వచ్చే నెల 13న విడుదల కానున్న సినిమా

..ఇది కూడా చదవండి
స్పీడ్ పెంచుతున్న రాజశేఖర్ కూతుళ్లు!
  • నటన దిశగా కూతుళ్లను ప్రోత్సహిస్తున్న రాజశేఖర్ 
  • శివాత్మిక నటించిన 'పంచతంత్రం' రేపే విడుదల 
  • శివాని చేసిన 'విద్య వాసుల అహం' సంక్రాంతికి రిలీజ్ 
  • వెబ్ సిరీస్ పట్ల ఉత్సాహం చూపుతున్న అక్కాచెల్లెళ్లు


More Latest News
TRS became BRS
UPI single block multiple debit facility coming soon How it will help you
Is that an animal or a person Anand Mahindra post will leave you thoroughly amazed Watch
KCR lays foundation to express metro
Inflation pushes up cost of Irani chai to Rs 20
YSRCP doesnt have right to speak about Varahi says Nadendla Manohar
Best in 2022 Phones with unique design that launched this year
BRS is historical need says Danam Nagender
It will be better if AP and Telangana unites says JD Lakshmi Narayana
Update your WhatsApp to use these amazing recently launched features
C Kalyan announces Ramanujacharya movie with Balakrishna
Billionaire CEO arranges for 3 day Disneyland trip for 10000 staff and their families
YS Sharmila to protest at Lotus Pond
Bandi Sanjay demands KCR to respond on Gujarat results
Pothula Balakotaiah Fires On Sajjala Comments
..more