సైబర్ నేరగాళ్ల బారినపడి, డీఎస్పీ చేతిలో అవమానపడి .. అనంతపురం ఎస్పీకి లేఖ రాసి అదృశ్యమైన ఆర్ఎంపీ!

26-09-2022 Mon 07:30
Anantapur RMP writes letter to SP and went missing

సైబర్ నేరగాళ్ల బారినపడి మోసపోయిన ఓ ఆర్ఎంపీ పోలీసులను ఆశ్రయిస్తే పోయిన డబ్బులు తిరిగి రావని చెప్పారు. పోలీసుల తీరుతో మనస్తాపం చెందిన ఆయన ఎస్పీకి లేఖ రాసి అదృశ్యమయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కొండాపురానికి చెందిన ఆర్ఎంపీ జి.వెంకటేశ్‌‌కు లక్కీ డ్రా పేరుతో వల విసిరిన సైబర్ నేరగాళ్లు అతడి నుంచి రూ. 15 లక్షలు కాజేశారు. 

చివరికి మోసపోయానని గ్రహించిన వెంకటేశ్ పోలీసులను ఆశ్రయించారు. అయితే వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఈ నెల 19న ‘స్పందన’ కార్యక్రమలో ఎస్పీకి తన బాధ చెప్పుకున్నారు. న్యాయం చేయాలని వేడుకున్నారు. ఆయన ఆదేశాలతో పుట్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా ఈ నెల 22న తాడిపత్రి డీఎస్పీ చైతన్య ఎదుట వెంకటేశ్ హాజరయ్యారు.

ఆ తర్వాత ఎస్పీకి వెంకటేశ్ లేఖ రాస్తూ.. డీఎస్పీ తనను అవమానించారని ఆరోపించారు. తన గురువైన మాజీ ఎమ్మెల్సీ గేయానంద్‌ను కూడా డీఎస్పీ కించపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, పోయిన డబ్బులు తిరిగి రావని, పోయి అడుక్కుతినండంటూ తిట్టారని పేర్కొన్నారు. డీఎస్పీ తన ఇంటికి వస్తానని, తన భార్యతో కలిసి భోజనం చేద్దామని అన్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరిన ఆయన ఆ తర్వాత అదృశ్యమయ్యారు. దీంతో వెంకటేశ్‌ను వెతికేందుకు రంగంలోకి దిగిన పోలీసులు అతను హైదరాబాద్‌లో ఉన్నట్టు గుర్తించారు. 

మరోవైపు, వెంకటేశ్‌ను మోసం చేసిన సైబర్ నేరగాడు కోల్‌కతాలో ఉన్నట్టు తెలుసుకుని పోలీసులు నిన్న కోల్‌కతా వెళ్లారు. రూ. 2.50 లక్షల వరకు రికవరీ చేసి బాధిత కుటుంబానికి అందించామని, నిందితుడిని అదుపులోకి తీసుకున్న అనంతరం మిగతా సొమ్మును కూడా రికవరీ చేసి బాధిత కుటుంబానికి అందజేస్తామని పుట్లూరు ఎస్సై గురుప్రసాద్ తెలిపారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
పంచాయతీ రాజ్ ఈఎన్ సీగా సుబ్బారెడ్డి నియామకం అతిపెద్ద దళిత ద్రోహం: నక్కా ఆనంద్ బాబు
  • పంచాయతీరాజ్ ఈఎన్ సీగా సీవీ సుబ్బారెడ్డి
  • తీవ్రస్థాయిలో స్పందించిన నక్కా ఆనంద్ బాబు
  • సీనియారిటీలో ఉన్న బాలు నాయక్ కు అన్యాయం చేశారని విమర్శలు
  • ఐదో స్థానంలో ఉన్న సుబ్బారెడ్డికి ఇచ్చారంటూ మండిపాటు

ap7am

..ఇది కూడా చదవండి
నా భార్యకు ఎలాంటి ఐటీ నోటీసులు రాలేదు: మంత్రి జయరాం
  • రేణుకమ్మ పేరిట 30 ఎకరాల భూమి కొన్నట్లు ఐటీ నోలీసులు
  • ఐటీ నోటీసులపై స్పందించిన మంత్రి జయరాం
  • తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం

..ఇది కూడా చదవండి
చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు: బీసీ మహాసభ పోస్టర్ రిలీజ్ కార్యక్రమంలో విజయసాయి
  • ఎన్నికల తర్వాత చంద్రబాబు, లోకేశ్ కి భవిష్యత్తు ఉండదన్న విజయసాయి 
  • బీసీలకు జగన్ పెద్దపీట వేశారని వెల్లడి 
  • మరో 25 ఏళ్లు జగనే సీఎం అంటూ వ్యాఖ్య 


More Latest News
Nakka Anand Babu fires over CV Subba Reddy appointment as new ENC
Poonam Kaur in suffering from rare decease
cpi telangana secretary kunamneni comments on political alliances
Jharkhand High Court gives nod to 15 years old girl marriage
ap minister jayaram responds on it notices to his wife
No alcohol for Delhi people for 3 days
Indian takes on G20 presidency today
Vijayasai comments on Chandrababu
ts government allotted the posts to new medical colleges
RBI launches Indian digital currency Digital Rupee
India womens cricketer Rajeshwari Gayakwad involved in altercation at super market
Delhi HC issues notices to Shashi Tharoor in Sunanda Pushkar death case
YS Sharmila slams CM KCR over her arrest
Shikhar Dhawan backs match winner Rishabh Pant over Sanju Samson
Etela comments on KCR and Kavitha
..more