అమరావతి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. జగన్ ది మైండ్ గేమ్ మాత్రమే: జేసీ ప్రభాకర్ రెడ్డి

18-09-2022 Sun 12:38
Jagan is playing mind game with Amaravati farmers says JC Diwakar Reddy

అమరావతి రైతులకు టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. మహా పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులను ఈరోజు ఆయన కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని చెప్పారు. రాజధాని అమరావతిలోనే ఉంటుందని అన్నారు. అమరావతే రాజధాని అని హైకోర్టు చెప్పిన ఆరు నెలలకు సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వ వెళ్లడం ఏమిటని ఎద్దేవా చేశారు. 

అమరావతి రైతులకు మద్దతు ప్రకటించేందుకు తాను రాయలసీమ నుంచి ఇక్కడకు వచ్చానని చెప్పారు. తనను ఎవరూ ఆపలేదని తెలిపారు. తమ ప్రాంతంలో కూడా పాదయాత్ర చేయాలని కోరుతున్నానని తెలిపారు. ఉత్తరాంధ్రకు వెళ్లొద్దని రైతులకు చెప్పడం సరికాదని అన్నారు. అన్ని ప్రాంతాలకు అమరావతి సమ దూరంలో ఉంటుందని చెప్పారు. రైతులను మానసికంగా భయపెట్టడానికే జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారని అన్నారు. వైసీపీ నేతలకు గత అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నంత ఊపు ఇప్పుడు లేదని చెప్పారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
పోర్టుల నిర్మాణంలో అత్యుత్త‌మ రాష్ట్రంగా ఏపీ... టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డు కైవ‌సం
  • పోర్టు ఆధారిత మౌలిక వ‌సతుల అభివృద్ధిలో అవార్డును ప్ర‌క‌టించిన టైమ్స్ ఆఫ్ ఇండియా
  • దేశంలోనే అత్యుత్త‌మ రాష్ట్రంగా ఎంపికైన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
  • అవార్డును అందుకున్న మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్‌

ap7am

..ఇది కూడా చదవండి
బ్రహ్మోత్సవాల సందర్భంగా వెంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
  • తిరుమల చేరుకున్న సీఎం జగన్
  • స్వాగతం పలికిన టీటీడీ వర్గాలు
  • సంప్రదాయ దుస్తుల్లో సీఎం జగన్
  • జ్ఞాపికలు బహూకరించిన ఆలయ వర్గాలు

..ఇది కూడా చదవండి
వాన్‌పిక్ భూముల‌ను జ‌ప్తు నుంచి విడుద‌ల చేయండి... ఈడీకి తెలంగాణ హైకోర్టు ఆదేశం
  • జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో వాన్‌పిక్ భూముల‌ను జ‌ప్తు చేసిన ఈడీ
  • ఆ భూముల్లో 1,416 ఎక‌రాల‌ను జ‌ప్తు నుంచి విడుద‌ల చేయాల‌న్న తెలంగాణ హైకోర్టు
  • మిగిలిన 11,804 ఎక‌రాల‌పై న‌వంబ‌ర్ 14న విచార‌ణ‌


More Latest News
Radical outfit PFI 8 associated fronts banned for 5 years
Chandrababu and Chiranjeevi pays condolences to Krishna and Mahesh Babu
Giorgia Meloni Italys first woman prime minister after second world war
 If you stay away from these you can get rid of sleepy feel in the office
Surrounded by wild elephants Kerala man sits on top of a tree for an hour
Tollywood Star Hero Mahesh Babu Mother Indira Devi Passed Away
There is no railway zone for Visakha center clarifies
gangster nayeem righ hand and close associate sheshanna arrested
Global recession ahead warns WTO chief
Kalwakuntla Kavitha participated in Bathukamma celebrations at telangana bhavan
Cinema theaters number decreases in India as the number raise in China
ed officials interrogates manchireddy kishan reddy for 9 hours
ECB shows keen interest to host test series between Team India and Pakistan
Modi improving medical infrastructure says amit shah
TDP sacked two state secretaries from the posts
..more