నయీంకే భయపడలేదు.. నీకు భయపడతానా?: సీఎం కేసీఆర్​పై ఈటల రాజేందర్​ ఫైర్​

14-09-2022 Wed 15:47
Etela rajender fires on cm kcr

తాను గతంలో నయీం ముఠా బెదిరించినప్పుడే భయపడలేదని.. ఇప్పుడు కేసీఆర్ కు ఎలా భయపడతానని బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. శాసనసభలో బీజేపీ సభ్యుల హక్కులను ప్రభుత్వం కాలరాసిందని.. స్పీకర్ ను మర మనిషి అన్నందుకు తనకు శిక్ష వేశారని.. మరి ఇన్నాళ్లూ కేసీఆర్ అన్న మాటలకు ఏం శిక్ష వేయాలని ప్రశ్నించారు. తప్పులు చేసినవాళ్లు దొరల్లా ఉంటున్నారని.. ప్రజల కోసం పనిచేసే వారికి శిక్షలు వేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు.

అసెంబ్లీలో గొంతు నొక్కుతున్నారు
అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఈటల మండిపడ్డారు. గతంలో ఒక ఎమ్మెల్యే ఉన్న పార్టీకి కూడా బీఏసీలో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చేవారని.. ఇప్పుడు బీఏసీ అంశం గురించి రఘునందన్ రావు అడిగినా స్పీకర్ పట్టించుకోలేదేమని నిలదీశారు. గవర్నర్ ప్రసంగం లేకుండా సభ ఎప్పుడూ జరగలేదని గుర్తు చేశారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. అసెంబ్లీలో ప్రజా సమస్యలను చర్చించలేదని విమర్శించారు. ప్రజలు హూజూరాబాద్ లో కేసీఆర్ ను తిరస్కరించి.. తనను సభలోకి పంపారని, అలాంటిది తనను సభ నుంచి వెళ్లగొట్టారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ను ఓడగొట్టేవరకు నిద్రపోనని ఈటల వ్యాఖ్యానించారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్న వారికి శిక్ష తప్పదు: కవితపై ఈటల పరోక్ష వ్యాఖ్యలు
  • ఇక్కడ దోపిడీ సరిపోదన్నట్టు ఢిల్లీలో దందాలు చేశారన్న ఈటల 
  • ధరణి పేరుతో వేల ఎకరాల భూమి మాయం చేశారని ఆరోపణ 
  • ప్రజాక్షేత్రంలో కేసీఆర్ కు శిక్ష తప్పదని వ్యాఖ్య 

ap7am

..ఇది కూడా చదవండి
తెలంగాణను దోచుకున్న చరిత్ర వైఎస్ కుటుంబానిది: బాల్క సుమన్
  • షర్మిల సంస్కారహీనంగా మాట్లాడుతున్నారన్న సుమన్
  • జగన్ ను తెలంగాణ ప్రజలు అడ్డుకున్న చరిత్రను మర్చిపోవద్దని వ్యాఖ్య
  • షర్మిల, ఆమె భర్త బయ్యారం గనులను కొల్లగొట్టాలని చూశారని విమర్శ

..ఇది కూడా చదవండి
ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఈడీ రిమాండ్ రిపోర్టులో కవిత పేరు
  • అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు
  • రూ. 100 కోట్లను చెల్లించిన సౌత్ గ్రూప్
  • సౌత్ గ్రూప్ ను నియంత్రించిన శరత్ రెడ్డి, కవిత, మాగుంట


More Latest News
Stock markets touches new heights
ap government hikes penalries on single use plastic
Nakka Anand Babu fires over CV Subba Reddy appointment as new ENC
Poonam Kaur in suffering from rare decease
cpi telangana secretary kunamneni comments on political alliances
Jharkhand High Court gives nod to 15 years old girl marriage
ap minister jayaram responds on it notices to his wife
No alcohol for Delhi people for 3 days
Indian takes on G20 presidency today
Vijayasai comments on Chandrababu
ts government allotted the posts to new medical colleges
RBI launches Indian digital currency Digital Rupee
India womens cricketer Rajeshwari Gayakwad involved in altercation at super market
Delhi HC issues notices to Shashi Tharoor in Sunanda Pushkar death case
YS Sharmila slams CM KCR over her arrest
..more