ఇది ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి చేస్తున్న ఉన్మాద యాత్ర: స్పీకర్ తమ్మినేని
11-09-2022 Sun 21:55 | Andhra
- రేపటి నుంచి అమరావతి రైతుల మహాపాదయాత్ర
- అమరావతి నుంచి అరసవల్లికి యాత్ర
- ఘాటు వ్యాఖ్యలు చేసిన తమ్మినేని
- ఉత్తరాంధ్రకు రాజధాని వద్దని చేస్తున్న యాత్ర అంటూ ఆగ్రహం

రాజధాని రైతులు అమరావతి నుంచి అరసవల్లి వరకు ఈ నెల 12 నుంచి చేపడుతున్న మహా పాదయాత్రపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ఉత్తరాంధ్రపై పాదయాత్ర అసమర్థుల అంతిమయాత్ర అని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రకు రాజధాని వద్దని చేస్తున్న యాత్ర ఇది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి చేస్తున్న ఉన్మాద యాత్ర అని ఘాటుగా విమర్శించారు. ఇలాంటి యాత్రకు ఎవరు అనుమతి ఇస్తారు? అని తమ్మినేని ప్రశ్నించారు.
ఒకే రాజధాని ఉండడం వల్ల, అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతమవడం వల్ల విభజన సమయంలో ఎంత నష్టపోయామో తెలియదా? అని నిలదీశారు. మూడు రాజధానులతో రాష్ట్రమంతటా అభివృద్ధి జరుగుతుందని అన్నారు. అసెంబ్లీ స్పీకర్ గా మాట్లాడే హక్కు తనకుందని తమ్మినేని ఉద్ఘాటించారు.
More Latest News
రిషబ్ పంత్ అభిమానులకు గుడ్ న్యూస్.. సర్జరీ సక్సెస్
2 minutes ago

ఆసుపత్రిలో వెంటిలేటర్ పై తారకరత్న.. వైరల్ అవుతున్న ఫొటో
4 minutes ago

భారత్ వృద్ధి కాస్త నెమ్మదించవచ్చు.. ఐఎంఎఫ్ అంచనా!
7 minutes ago

జగన్ పై దాడి కేసు... బాధితుడు జగన్ ను కూడా విచారణకు హాజరుపరచాలంటూ ఎన్ఐఏకు కోర్టు ఆదేశాలు
29 minutes ago

కేంద్ర బడ్జెట్ మీ ఫోన్ లోనే చూడొచ్చు.. ఎలాగంటే..!
35 minutes ago

మంచి కంటి చూపుకు ఆయుర్వేద పరిష్కారాలు ఇవిగో..!
35 minutes ago

అండర్ 19 మహిళల ప్రపంచకప్ విజేతలకు సచిన్ చేతుల మీదుగా సత్కారం
51 minutes ago

అచ్యుతాపురం సెజ్ లో భారీ పేలుడు
54 minutes ago

చిరూ క్లాప్ తో మొదలైన నాని 30వ సినిమా!
1 hour ago

హన్సిక వివాహ ఫిల్మ్ టీజర్ విడుదల
1 hour ago
