తెలంగాణలో 100కి దిగువన కరోనా రోజువారీ కేసులు
11-09-2022 Sun 19:39 | Telangana
- గత 24 గంటల్లో 7,938 కరోనా పరీక్షలు
- 88 మందికి పాజిటివ్
- హైదరాబాదులో 56 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 102 మంది
- ఇంకా 874 మందికి చికిత్స

తెలంగాణలో కరోనా వ్యాప్తి బాగా తగ్గిపోయింది. గడచిన 24 గంటల్లో 7,938 కరోనా పరీక్షలు నిర్వహించగా, 88 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. వాటిలో 56 కేసులు హైదరాబాద్ లో నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 8 కొత్త కేసులు గుర్తించారు. ఇంకా 60 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అదే సమయంలో 102 మంది కరోనా నుంచి కోలుకోగా, కొత్తగా మరణాలేవీ సంభవించలేదు.
తెలంగాణలో ఇప్పటిదాకా 8,35,941 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,30,956 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 874 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు.
More Latest News
ఫ్లోరిడాలో దుండగుల కాల్పులు.. పదిమందికి గాయాలు!
17 minutes ago

తీవ్ర ఉత్కంఠ.. మూడు రాజధానులపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ
23 minutes ago

బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించాలంటూ గవర్నర్ ను స్వయంగా ఆహ్వానించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి
11 hours ago

వాయుగుండం.. రేపు ఏపీకి వర్ష సూచన
12 hours ago
