-->

భార్యతో కలిసి ఆలయానికి వచ్చి.. అమ్మవారికి నాలుక కోసి సమర్పించిన భర్త!

11-09-2022 Sun 09:53 | National
Devotee cuts off tongue and offers it to goddess

భార్యతో కలిసి ఆలయానికి వచ్చిన ఓ భర్త తన నాలుకను కోసి అమ్మవారికి సమర్పించాడు. ఉత్తరప్రదేశ్‌లోని కౌశంబీలో జరిగిందీ ఘటన. పట్టణానికి చెందిన సంపత్ (40) భార్య బన్నోదేవితో కలిసి స్థానికంగా వెలసిన శక్తిపీఠమైన కదాధామ్‌లోని శీతలామాత ఆలయానికి వెళ్లాడు. తొలుత ఇద్దరూ కలిసి గంగానదిలో స్నానం చేశారు. అనంతరం పూజలు చేసి ప్రదక్షిణాలు ముగించారు. ఆ తర్వాత వెంట తెచ్చుకున్న బ్లేడుతో నాలుక కోసుకున్న సంపత్ దానిని అమ్మవారికి సమర్పించాడు. అది చూసిన భక్తులు నిర్ఘాంతపోయారు. 

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆలయం వద్దకు చేరుకుని సంపత్‌ను కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం జిల్లా ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం వల్ల అతడి పరిస్థితి విషమంగా మారినట్టు కౌశంబి జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ దీపక్ సేథ్ తెలిపారు. వీలైతే అతడిని ప్రయాగ్‌రాజ్‌లోని ఎస్ఆర్ఎన్ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తామన్నారు. తన ప్రార్థనలు ఫలించాలన్న ఉద్దేశంతోనే సంపత్ తన నాలుకను అమ్మవారికి సమర్పించినట్టు స్థానికులు తెలిపారు. కాగా, సంపత్-బానోదేవి దంపతులకు నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
భారత్ వృద్ధి కాస్త నెమ్మదించవచ్చు.. ఐఎంఎఫ్ అంచనా!
  • ప్రపంచ ఆర్థిక పరిస్థితిపై జనవరి అప్ డేట్ రిలీజ్ చేసిన అంతర్జాతీయ ద్రవ్య నిధి
  • 2023లో ప్రపంచ వృద్ధిలో 50 శాతం వాటా చైనా, భారత్ దేనని వెల్లడి
  • ఇండియాలో ద్రవ్యోల్బణం తగ్గుతుందని రిపోర్ట్

ap7am

..ఇది కూడా చదవండి
కేంద్ర బడ్జెట్ మీ ఫోన్ లోనే చూడొచ్చు.. ఎలాగంటే..!
  • బుధవారం పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి
  • ఈసారి కూడా పేపర్ లెస్ బడ్జెట్.. మొబైల్ యాప్ లో అందుబాటులోకి
  • ప్లే స్టోర్ నుంచి యూనియన్ బడ్జెట్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు

..ఇది కూడా చదవండి
పార్లమెంట్ లో రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము తొలి ప్రసంగం.. హైలైట్స్
  • పార్లమెంట్ లో రాష్ట్రపతికి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
  • బడ్జెట్ సమావేశాలను ప్రారంభించిన రాష్ట్రపతి
  • ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడిన ముర్ము
  • హాజరుకాని కాంగ్రెస్ ఎంపీలు.. పార్టీ తరఫున సోనియా గాంధీ హాజరు


More Latest News
Rishabh Pant latest health updates Good news for India star check details inside
Pic of Tarakaratna on ventilator going viral
expecting slowdown in indian economy in 2023
NIA Court orders Jagan to attend hearing in Kodi Kathi case
Venu Madhav Mother Interview
Special mobile App to study Budget in Your phone
Ayurvedic remedies to improve eye health
Sachin Tendulkar to facilitate India U19 team for world cup victory
big Blast in Achyutapuram sez
president droupadi murmu speech in parliament
Nani 30 th movie update
Hansika motwani wedding film teaser out
KCR will go to farm house says Kishan Reddy
83 Killed In Suicide Bomb Attack At Mosque In Pakistan
No place for violence vandalism Australian minister after pro Khalistanis attack Indians in Melbourne
..more