/

లిఫ్ట్​ లో చిన్నారిని కరిచిన కుక్క.. ఏ మాత్రం చలించని యజమానికి రూ. 5 వేల జరిమానా

07-09-2022 Wed 11:40
 Woman fined Rs 5000 after pet dog bites child in lift

పెంపుడు కుక్క ఓ చిన్న పిల్లవాడిని కరిచిన కారణంగా ఆ యజమానికి మున్సిపల్ కార్పొరేషన్ రూ. 5 వేల జరిమానా విధించింది. ఈ సంఘటన ఘజియాబాద్ లో చోటు చేసుకుంది. ఈనెల ఐదో తేదీ సాయంత్రం స్కూలు నుంచి తిరిగొచ్చిన ఓ బాలుడు ఘజియాబాద్‌లోని రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్ చార్మ్స్ కౌంటీ సొసైటీలో ఇంటికి వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కాడు. అప్పటికే ఒక మహిళ తన పెంపుడు కుక్కతో కలిసి లిఫ్ట్‌లోకి వచ్చింది. కాసేపటికే ఆ కుక్క పిల్ల... బాలుపైకి దూకి అతడిని కరిచింది. 

ఆ చిన్నారి నొప్పితో అరుస్తున్నప్పటికీ ఆ మహిళ ఏ మాత్రం చలించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అతడిని పట్టించుకోకుండా వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు నంద్‌గ్రామ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై చర్యలు తీసుకున్న పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. తదుపరి విచారణ జరుగుతోంది. ఘటన తర్వాత ఘజియాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మహిళ ఇంటికి చేరుకుని పెంపుడు కుక్క వివరాలను నమోదు చేయలేదని గుర్తించారు. ఆమెకు రూ. 5 వేల జరిమానా విధించారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
గుజరాత్ లో రికార్డు స్థాయి విజయం దిశగా బీజేపీ.. పార్టీ కార్యాలయం వద్ద మొదలైన సంబరాలు
  • 182 స్థానాలకు గాను 152 స్థానాల్లో బీజేపీ ముందంజ
  • 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్
  • స్వీట్లు పంచుకుంటున్న బీజేపీ శ్రేణులు

ap7am

..ఇది కూడా చదవండి
హిమాచల్ ప్రదేశ్ లో క్యాంపు రాజకీయాలు..
  • ఎమ్మెల్యేలను రాజస్థాన్ కు తరలించే యోచనలో కాంగ్రెస్ పార్టీ
  • ఫలితాల ట్రెండ్ లో హోరాహోరీ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం
  • ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ కు బాధ్యతల అప్పగింత
  • పర్యవేక్షించనున్న సీనియర్ నేత భూపేందర్ సింగ్ హుడా

..ఇది కూడా చదవండి
గుజరాత్ లో దూసుకుపోతున్న బీజేపీ... హిమాచల్ లో బీజేపీ, కాంగ్రెస్ నువ్వా? నేనా?
  • గుజరాత్ లో 182 స్థానాలకు గాను 156 చోట్ల బీజేపీ ముందంజ
  • హిమాచల్ ప్రదేశ్ లో అధికారం కోసం 35 స్థానాల్లో గెలవడం అవసరం
  • బీజేపీ 33 చోట్ల, కాంగ్రెస్ 31 చోట్ల ఆధిక్యం


More Latest News
Celbration at Gujarat BJP office
Tomorrow OTT Release Movies
camp politics in himachal pradesh congress
Bjp going to get huge majority in Gujarat mixed results in Himachal pradesh
Allu Arjun Rashmika Mandanna Srivalli from Pushpa finds a place in Googles Top Songs
Vedantu sacks 385 employees
Bigg Boss 6  Update
Basara Online Aksharabhyasam Tickets Prices out
Salman Khan and Pooja Hegde in love
Congress plans to shift Himachal MLAs to Rajasthan
Only corruption prevailing in TTD says Ramana Dikshitulu
Annavaram Devasthanam Anna prasadam served in steel plates from today
Mahesh Babu enters food business
BJP leads in Gujarat Congress leads in Himachal Pradesh
Telugu TV Anchor Files Case Against His Friend for Photo Morphing
..more