కొడాలి నాని ఇంటిని ముట్టడించేందుకు యత్నించిన తెలుగు మహిళలు
06-09-2022 Tue 15:20 | Andhra
- గుడివాడలోని నాని ఇంటిని ముట్టడించేందుకు యత్నం
- మహిళలను కించపరిచేలా మాట్లాడారని ఆగ్రహం
- తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్

వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఇంటిని ముట్టడించేందుకు తెలుగు మహిళలు యత్నించారు. గుడివాడ లోని కొడాలి నాని ఇంటిని ముట్టడించేందుకు వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, తెలుగు మహిళలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పలువురు టీడీపీ మహిళా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ క్రమంలో తెలుగు మహిళలు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. మహిళలను కించపరిచేలా మాట్లాడిన కొడాలి నానికి, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొడాలి నాని తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
More Latest News
నారా లోకేశ్ 6వ రోజు యువగళం పాదయాత్ర.. హైలైట్స్
3 hours ago

కేంద్ర బడ్జెట్ పై చిదంబరం తీవ్ర విమర్శలు
4 hours ago

'శాకుంతలం' నుంచి మరో బ్యూటిఫుల్ సాంగ్ రిలీజ్!
5 hours ago

యూత్ ను ఆకట్టుకునే 'శశివదనే' సాంగ్!
6 hours ago
