-->

మణిపూర్‌లో నితీశ్ కుమార్ జేడీయూకు ఎదురుదెబ్బ.. ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో విలీనం

03-09-2022 Sat 09:40 | National
Nitish Kumars JDU faces setback in Manipur

బీహార్‌లో బీజేపీతో కటీఫ్ చేసుకుని ఆర్జేడీ చేయి అందుకున్న జేడీయూ చీఫ్, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మణిపూర్‌లో ఆ పార్టీకి ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేల్లో ఐదుగురు బీజేపీలో విలీనమయ్యారు. ఆ వెంటనే నితీశ్‌ను ఉద్దేశించి బీజేపీ నేత, ఎంపీ సుశీల్ మోదీ ట్వీట్ చేస్తూ.. మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ‘జేడీయూ ముక్త్’గా మారుతున్నాయని సెటైర్ వేశారు.

జేడీయూ ఎమ్మెల్యే విలీనాన్ని మణిపూర్ అసెంబ్లీ స్పీకర్ ఆమోదించారు. నితీశ్ కుమార్‌కు ఎదురుదెబ్బలు తగలడం గత 9 రోజుల్లో ఇది రెండోసారి. ఆగస్టు 25న అరుణాచల్ ప్రదేశ్ జేడీయూ ఎమ్మెల్యే టెకి కసో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. 2019లో అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో జేడీయూ ఏడు సీట్లను గెలుచుకుంది. ఆ తర్వాత అందులో ఆరుగురు శాసనసభ్యులు బీజేపీలో చేరారు. ఆగస్టు 25న ఆ మిగిలిన ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీలో చేరడంతో అక్కడ జేడీయూ ప్రాతినిధ్యం లేకుండా పోయింది.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
ఈ బడ్జెట్ లో అన్ని అంశాలు సమతూకంలో ఉన్నాయి: నిర్మలా సీతారామన్
  • నేడు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల
  • మధ్య తరగతికి ఉపశమనం కలిగించే బడ్జెట్ అని వెల్లడి
  • మహిళా సాధికారతకు ప్రాముఖ్యత ఇచ్చామని వివరణ

ap7am

..ఇది కూడా చదవండి
కేంద్ర బడ్జెట్ పై ప్రధాని మోదీ స్పందన
  • రూ.45 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్
  • పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
  • పురోగామి భారత్ కు ఈ బడ్జెట్ పునాది వంటిదన్న మోదీ
  • కొత్తశక్తిని అందించే బడ్జెట్ అని కితాబు

..ఇది కూడా చదవండి
కాసేపట్లో బడ్జెట్... రాష్ట్రపతిని కలిసిన నిర్మలా సీతారామన్
  • 2023-24 కేంద్ర బడ్జెట్ కు సర్వం సిద్ధం
  • కాసేపట్లో కేంద్ర క్యాబినెట్ తో నిర్మలా భేటీ
  • కేంద్ర క్యాబినెట్ ఆమోదం అనంతరం పార్లమెంటులో బడ్జెట్
  • వరుసగా ఐదోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలా


More Latest News
India wins T20 series against New Zealand
Kodali Nani comments on Kotamreddy
Nara Lokesh padaya 6th day
Subhman Gill century in t20 against New Zealand
Chidambaram comments on Union budget
Ram Mohan Naidu fieres on Jagan
Shakunthalam lyrical song release
Balineni response on Kotamreddy Phone tapping allegations
Amigos movie update
31 YSRCP MPs does not did any thing for AP in union budget says Chandrababu
YSRCP MP Mithun Reddy response on Union budget
Sasivadane lyrical song released
Perni Nani on phone tapping issue
Jagan key meeting with Sajjala and police amid Kotamreddy phone tapping allegations
Nirmala Sitharaman press meet after budget announcement
..more