భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
01-09-2022 Thu 15:52 | Business
- 770 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 217 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
- రెండున్నర శాతానికి పైగా నష్టపోయిన బజాజ్ ఫిన్ సర్వ్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, చైనాలో స్లోడౌన్, భారత్ జీడీపీ అంచనాలను అందుకోలేకపోవడం వంటివి ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. దీంతో, మార్కెట్లు ఈరోజు ఉదయం నుంచి నష్టాల్లోనే కొనసాగాయి. ఈ క్రమంలో ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 770 పాయింట్లు కోల్పోయి 58,766కి పడిపోయింది. నిఫ్టీ 217 పాయింట్లు నష్టపోయి 17,542కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (2.58%), ఏసియన్ పెయింట్స్ (1.81%), భారతి ఎయిర్ టెల్ (1.03%), టైటాన్ (0.93%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.56%).
టాప్ లూజర్స్:
రిలయన్స్ (-2.99%), టీసీఎస్ (-2.49%), సన్ ఫార్మా (-2.21%), టెక్ మహీంద్రా (-2.15%), ఇన్ఫోసిన్ (-1.93%).
More Latest News
విదేశాల్లోనూ యూపీఐ సేవలు.. ప్రారంభించిన ఫోన్ పే!
2 hours ago

టర్కీ భూకంప విలయం.. మృత్యుంజయులు ఈ చిన్నారులు!
3 hours ago

ముంబయి బిజినెస్ మేన్ ను పెళ్లాడిన 'నేనింతే' హీరోయిన్
11 hours ago
