కుప్పం మీద ప్రేమ పుట్టిందా?.. కుప్పం అంటే భయం పట్టిందా?: అంబటి రాంబాబు
24-08-2022 Wed 16:32 | Andhra
- కుప్పం చేరిన టీడీపీ అధినేత చంద్రబాబు
- కుప్పంలో బాబు టూర్‌పై అంబటి సెటైర్లు
- పదే పదే కుప్పం వెళ్తున్న చంద్రబాబు అంటూ వ్యాఖ్య

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు బుధవారం తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు బయలుదేరిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి విమానం ద్వారా బెంగళూరు చేరిన చంద్రబాబు... అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కుప్పం చేరుకున్నారు. బుధవారం నుంచి మొదలైన చంద్రబాబు కుప్పం పర్యటన మూడు రోజుల పాటు కొనసాగనుంది.
ఈ సందర్భంగా కుప్పం పర్యటనకు చంద్రబాబు బయలుదేరుతున్న సమయాన ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు సంధించారు. 'పదే పదే కుప్పం వెళ్తున్న బాబు గారు, కుప్పం మీద ప్రేమ పుట్టిందా?, కుప్పం అంటే భయం పట్టిందా?' అంటూ చంద్రబాబును ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు.
More Latest News
అమెరికాలో కొనసాగుతున్న తుపాకి కాల్పులు. ఈసారి ఫ్లోరిడాలో!
14 minutes ago

తీవ్ర ఉత్కంఠ.. మూడు రాజధానులపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ
19 minutes ago

బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించాలంటూ గవర్నర్ ను స్వయంగా ఆహ్వానించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి
11 hours ago

వాయుగుండం.. రేపు ఏపీకి వర్ష సూచన
12 hours ago
