-->

ఎమ్మెల్సీ అనంత‌బాబుకు హైకోర్టులో భారీ ఊర‌ట‌

23-08-2022 Tue 19:18 | Andhra
ap high court extends mlc ananthababu bail upto september 5

డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం హ‌త్య కేసులో అరెస్టయిన వైసీసీ బ‌హిష్కృత ఎమ్మెల్సీ అనంత‌బాబుకు వ‌రుస‌గా రెండో రోజైన మంగ‌ళ‌వారం భారీ ఊర‌ట ల‌భించింది. అరెస్టయిన నాటి నుంచి బెయిల్ కోసం అనంత‌బాబు చేసిన య‌త్నాల‌న్నీ విఫ‌ల‌మ‌వుతూ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే రెండు రోజుల క్రితం అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో అనంత‌బాబు త‌ల్లి మ‌ర‌ణించారు. త‌న త‌ల్లి అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌ర‌య్యేలా అనుమ‌తి ఇవ్వాలంటూ అనంత‌బాబు దాఖ‌లు చేసుకున్న పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టిన రాజ‌మండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆయ‌న‌కు 3 రోజుల పాటు తాత్కాలిక బెయిల్‌ను మంజూరు చేసింది.

అయితే రాజ‌మండ్రి కోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ త‌న‌కు మ‌రిన్ని రోజుల పాటు బెయిల్ ఇవ్వాలంటూ అనంత‌బాబు మంగ‌ళ‌వారం ఏపీ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు అనంత‌బాబుకు సెప్టెంబ‌ర్ 5 దాకా మ‌ధ్యంతర బెయిల్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పుతో రాజ‌మండ్రి కోర్టు ఇచ్చిన 3 రోజుల బెయిల్‌కు అద‌నంగా 11 రోజుల పాటు బెయిల్ ల‌భించిన‌ట్టయింది.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
వివేకా హత్య కేసు కుట్రదారులను సీబీఐ వెలుగులోకి తెస్తుండడంతో విశాఖ వ్యవహారం తెరపైకి తెచ్చారు: దేవినేని ఉమ
 • సీఎం జగన్ అభద్రతాభావంలో ఉన్నారన్న దేవినేని ఉమ
 • కేసు విచారణలో ఉండగా ఎలా మాట్లాడతారంటూ ఆగ్రహం
 • వివేకా హత్య కేసు ముద్దాయిలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు

ap7am

..ఇది కూడా చదవండి
జగన్ లా నేను దొంగ హామీలు ఇవ్వను... నెరవేర్చే హామీలే ఇస్తా: నారా లోకేశ్
 • లోకేశ్ యువగళం పాదయాత్రకు నేడు ఐదో రోజు
 • పలమనేరు నియోజకవర్గంలో కొనసాగుతున్న యాత్ర
 • గ్రామాల్లో లోకేశ్ కు అపూర్వ నీరాజనాలు
 • వివిధ వర్గాలను కలుస్తూ ఉత్సాహంగా సాగుతున్న లోకేశ్

..ఇది కూడా చదవండి
నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. కుటుంబ సభ్యులతో కూడా వాట్సాప్ కాల్ మాట్లాడాల్సి వస్తోంది: వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి
 • సొంత పార్టీ నేతలే ఫోన్ ట్యాప్ చేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలన్న ఆనం
 • రాజ్యాంగేతర శక్తులు అధికారం చెలాయించడం సరికాదని వ్యాఖ్య
 • వైసీపీ ప్రభుత్వ పనితీరుపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయని కామెంట్ 


More Latest News
Devineni Uma criticizes CM Jagan
KTR fires on Bandi Sanjay and Eatala
YV Subbareddy talks about CBI notices to Naveen
Amigos song released
Jogi Ramesh replies to opposition criticism over AP Capital
BJP leader Sathya Kumar questions CM Jagan statement on AP Capital
Gandhinagar Sessions Court sentenced Asaram to life imprisonment
Tension in KTRs Karimnagar trip
Lokesh continues his Yuvagalam Padayatra in Palamaneru constituency
Kieron Pollard Smashes Ball Outside Sharjah Stadium twice
Markets ends in profits
Tirumala update
Nagababu Interview
private vehicle at tirumala srivari temple streets
Sunny Leone injured in shooting
..more