మూడ్నెల్లకోసారి ప్రమోషన్లపై స్పష్టత నిచ్చిన విప్రో

18-08-2022 Thu 14:20
Wipro clarifies on variable pay and quarterly promotions

ప్రముఖ దేశీయ ఐటీ సంస్థ విప్రో తమ ఉద్యోగుల వేతనాల్లో భాగమైన వేరియబుల్ పేను నిలిపివేస్తున్నట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ లాభాలు తగ్గినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈ కథనాల్లో పేర్కొన్నారు. దీనిపై విప్రో వర్గాలు స్పందించాయి. సెప్టెంబరు 1వ తేదీ నుంచి అమలు చేయాల్సిన ఉద్యోగుల జీతాల పెంపును తాము నిలిపివేయడం లేదని స్పష్టం చేశాయి.

అంతేకాదు, మిడ్ మేనేజ్ మెంట్ స్థాయిలో మెరుగైన పనితీరు కనబర్చిన ఉద్యోగులకు మూడు నెలలకోసారి ప్రమోషన్లు ఇచ్చే విధానాన్ని కొనసాగిస్తున్నామని విప్రో పేర్కొంది. జులై మాసం నుంచి ప్రమోషన్లు క్రమంగా అమలు చేస్తున్నామని, ఇప్పటికే తొలి దశ ప్రమోషన్లు పూర్తయ్యాయని తెలిపింది. అయితే, మూడ్నెల్లకోసారి చెల్లించే వేరియబుల్ పేపై ఇప్పుడేమీ ప్రకటన చేయలేమని వెల్లడించింది.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
ఆర్బీఐ నిర్ణయంతో దూసుకుపోయిన మార్కెట్లు.. వెయ్యి పాయింట్లకు పైగా లాభపడ్డ సెన్సెక్స్
  • రెపో రేటును ఆర్బీఐ పెంచడంతో దూసుకెళ్లిన మార్కెట్లు
  • 1,017 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 276 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ

ap7am

..ఇది కూడా చదవండి
మరోసారి రేట్లను పెంచిన ఆర్బీఐ.. రుణ చెల్లింపులపై భారం
  • అర శాతం మేర పెరిగిన రెపో రేటు
  • 5.90 శాతానికి చేరిన రెపో
  • 7 శాతానికి వృద్ధి అంచనాల తగ్గింపు

..ఇది కూడా చదవండి
రిల‌య‌న్స్ అధినేత ముఖేశ్ అంబానీ భద్రత 'జ‌డ్ ప్ల‌స్' కేటగిరీకి పెంపు
  • ప్ర‌స్తుతం జడ్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌లో ముఖేశ్ అంబానీ
  • గ‌తేడాది ముఖేశ్ ఇంటి వ‌ద్ద పేలుడు ప‌దార్థాలున్న వాహ‌నం గుర్తింపు
  • ముఖేశ్ భ‌ద్ర‌త‌పై విస్తృతంగా చ‌ర్చించిన కేంద్రం
  • జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరీలో ముఖేశ్‌కు 55 మంది సిబ్బందితో భ‌ద్ర‌త‌


More Latest News
YSRCP leaders makes Kadapa as mafia center says TDP
Pawan Kalyan performs Saraswathi Devi pooja at Janasena office in Hyderabad
nagarjuna akkineni comments on his political entry
pm modi stops his convoy to give way to the ambulence
23 Killed in Kabul suicide attack
Are Deepika Padukone and Ranvir Singh taking divorce
some candidates got above full marks in ap tet
Ponniyin Selven Movie Review
Chandrababu says they had organized national games in a grand style
ap complaint to krmd over telangana
Markets ends in profits
KCT donates gold to Yadadri
T20 World Cup prize money details
ap minister gudivada amarnath fires on ts minister harish rao comments
Mallikarjun Kharge and shashi Tharoor files their nominations
..more