గ్యాస్ తో నడిచే స్విఫ్ట్ మోడల్ ను ఆవిష్కరించిన మారుతి సుజుకి

14-08-2022 Sun 18:16
Maruti Suzuki launches CNG based new Swift model

కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి గ్యాస్ ఆధారిత సరికొత్త స్విఫ్ట్ ఎస్-సీఎన్జీ మోడల్ ను తీసుకువచ్చింది. ఇది సీఎన్జీతో నడిచే కారు. దీంట్లో వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ పేరిట రెండు వేరియంట్లు ఉన్నాయి. వీటి ఎక్స్ షోరూమ్ ధరలు రూ.7.77 లక్షలు, రూ.8.45 లక్షలుగా ఉన్నాయి. మారుతి సుజుకి నుంచి వచ్చిన గ్యాస్ ఆధారిత కార్లలో స్విఫ్ట్-ఎస్ సీఎన్జీ 9వ మోడల్. ఇప్పటికే ఆల్టో, వాగన్ ఆర్, సెలెరియో, డిజైర్, ఎర్టిగా, ఈకో, సూపర్ క్యారీ, టూర్-ఎస్ వాహనాల సీఎన్జీ వెర్షన్లు విడుదలయ్యాయి. 

కాగా, కొత్తగా వస్తున్న స్విఫ్ట్ ఎస్-సీఎన్జీ ఒక కిలో గ్యాస్ తో 30.90 కిమీ ప్రయాణించవచ్చని మారుతి వర్గాలు వెల్లడించాయి. ఇందులో ప్రధానంగా 1.2ఎల్ కే సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ వీవీటీ ఇంజిన్ ను అమర్చారు. భారత్ లో ప్రస్తుతం ఉన్న సీఎన్జీ హ్యాచ్ బ్యాక్ మోడల్ కార్లలో ఇదే అత్యంత శక్తిమంతమైది. అంతేకాదు, గ్యాస్ ఆధారిత వాహనాల్లో అత్యధిక మైలేజి ఇచ్చే వాహనం కూడా ఇదే. 

ఇందులోని గ్యాస్ లీక్ కాకుండా స్టెయిన్ లెస్ స్టీలు పైపులు, లోహపు జాయింట్లు పొందుపరిచారు. గ్యాస్ నింపే సమయంలో కారు స్టార్ట్ కాకుండా మైక్రోస్విచ్ ఏర్పాటు చేశారు.

..Read this also
మార్కెట్లకు బ్లాక్ ఫ్రైడే... కుప్పకూలిన సెన్సెక్స్
  • 1,020 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 302 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 8 శాతం వరకు నష్టపోయిన పవర్ గ్రిడ్ షేర్ విలువ

ap7am

..Read this also
19 ఏళ్లకే వెయ్యి కోట్ల సంపాదనతో రికార్డుకెక్కిన భారత యువ వ్యాపారవేత్త
  • ఐఐఎఫ్ ఎల్ వెల్త్-హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022లో చోటు 
  • ఈ ఘనత సాధించిన పిన్నవయస్కుడిగా జెప్టో వ్యవస్థాపకుడు కైవల్య వోహ్రా
  • స్నేహితుడితో కలిసి గతేడాది జెప్టో ను ప్రారంభించిన వోహ్రా

..Read this also
హీరో బైకుల ధరలు పెరిగాయి
  • ధరల పెంపు ప్రకటన విడుదల చేసిన హీరో మోటో కార్ప్
  • ఉత్పత్తి ఖర్చులు పెరగడంతోనే ధరలు పెంచుతున్నట్లు వెల్లడి
  • ఒక్కో బైక్ ధర రూ.1,000 మేర పెరుగుతుందని ప్రకటన
  • పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడి


More Latest News
BCCI election notification released
India will peace side says Jai Shankar
Karnataka former chief minister SM Krishna hospitalized with respiratory infection
Roja warns Nandamuri Balakrishna
Bathukammas at Uppa Stadium during India and South Africa T20
Russia advocates for permanent membership to India in UNSC
Godfather Grand Pre Release Event on 28th from 6 PM at Anantapur
BJP Satya Kumar fires on Jagan
GVL tweets on health university name change issue
Netflixs Rana Naidu teaser released
Fake IT Firms taking Indian IT professionals to Myanmar and torturing
England dressing rooms stunned reaction after Deepti s run out
 Chandigarh airport to be named after Bhagat Singh announces PM Modi
North Korea fires ballistic missile ahead of US VP Kamala Harris visit
Another mistake by HCA timing of the match was wrong on the T20 tickets
..more