కడుపుబ్బరంతో బాధపడుతున్నారా.. ఈ 12 ఆహార పదార్థాలతో ఉపశమనం ఉంటుందంటున్న నిపుణులు

13-08-2022 Sat 16:36
These 12 foods helps to reduce stomuch bloating

కడుపుబ్బరం.. ఇటీవలి కాలంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య. కడుపు ఉబ్బిపోయి నిలబడ్డా, కూర్చున్నా ఇబ్బంది పడే పరిస్థితి. ఒక్కోసారి ఊపిరి కూడా సరిగా ఆడదు. ఫాస్ట్ ఫుడ్ వినియోగం పెరగడం, నిద్ర సరిగా లేకపోవడం, వేళతప్పి వేళకు తినడం, మసాలా ఎక్కువగా ఉండే ఆహారం.. ఇలా ఏదైతే ఏం.. చాలా మంది కడుపు ఉబ్బరం, ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. మనం తినే ఆహార పదార్థాలు కడుపుబ్బరంపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 12 రకాల ఆహార పదార్థాలు కడుపుబ్బరాన్ని తగ్గించగలవని వివరిస్తున్నారు.

దోసకాయలు
దోసకాయల్లో నీటి శాతం ఎక్కువ. కొన్ని రకాల పోషకాలు ఎక్కువ. దోసకాయలను మన ఆహారంలో చేర్చుకుంటే.. జీర్ణ శక్తి మెరుగవుతుందని, కడుపుబ్బరం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక మలబద్ధకం కడుపుబ్బరానికి కారణం అవుతుందని, దోసకాయలు ఈ సమస్యను తగ్గించగలవని వివరిస్తున్నారు.

అల్లం
  మన జీర్ణ వ్యవస్థకు అత్యంత మేలు చేసే ఆహార పదార్థాల్లో అల్లం ఒకటని నిపుణులు చెబుతున్నారు. దానికి ఉన్న యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు, అల్లంలోని జింజిబైన్ అనే ఎంజైమ్ జీర్ణశక్తిని మెరుగుపర్చుతాయని వివరిస్తున్నారు. అందువల్ల వంటల్లో, డ్రింక్స్ లో అల్లంను చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

అరటి పండ్లు
అరటి పండ్లలో ఫైబర్ తోపాటు పొటాషియం ఎక్కువ. తరచూ కడుపు ఉబ్బరంతో బాధపడుతున్న వారికి ఈ రెండూ మంచి ఉపశమనం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. రోజూ అరటి పండ్లను తినడం వల్ల జీర్ణ శక్తి కూడా మెరుగవుతుందని అంటున్నారు.

పెరుగు
మంచి ప్రోబయాటిక్ ఆహారంలో పెరుగు కీలకమైనది. దీనిలోని ప్రోబయాటిక్స్ మన జీర్ణ వ్యవస్థలోని మంచి బ్యాక్టీరియా ఎదుగుదలకు తోడ్పడుతాయి. ఇది జీర్ణ శక్తి పెరిగి కడుపుబ్బరాన్ని తగ్గించేందుకు తోడ్పడుతుందని చెబుతున్నారు.

ఓట్స్
  ఆహారం ఏదైనా ఫైబర్ శాతం ఎక్కువగా ఉండటం జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుందని.. ఓట్స్ లో ఉండే అధిక ఫైబర్ బాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థలోని వివిధ భాగాల్లో ఆహారం ఆగిపోకుండా.. వేగంగా క్లియర్ కావడానికి ఫైబర్ దోహదం చేస్తుందని వివరిస్తున్నారు.

గ్రీన్ టీ
శరీరంలో జీవ క్రియలు సమర్థవంతంగా కొనసాగడానికి గ్రీన్ టీ దోహదం చేస్తుంది. జీవ క్రియలు సమర్థవంతంగా కొనసాగడమంటే.. ఆహారం కూడా బాగా జీర్ణమవుతుందని నిపుణులు వివరిస్తున్నారు. గ్రీన్ టీ తాగడం వల్ల కడుపు ఉబ్బరానికి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.

టమాటాలు
 కడుపు ఉబ్బరాన్ని తగ్గించే ఉత్తమ ఆహార పదార్థాల్లో టామాటాలు ఒకటని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇందులోని లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్.. నేరుగా జీర్ణ వ్యవస్థను మెరుగు పర్చుతుందని అంటున్నారు.

నిమ్మ జాతి పండ్లు
నారింజ, నిమ్మ, బత్తాయి వంటి సిట్రస్ జాతి పండ్లు కడుపు ఉబ్బరాన్ని తగ్గించేందుకు దోహదపడతాయని నిపుణులు వివరిస్తున్నారు. వీటిలో పెద్ద సంఖ్యలో ఉండే పోషకాలు మంచి జీర్ణశక్తికి తోడ్పడతాయని అంటున్నారు.

గ్రీన్ లీఫీ వెజిటబుల్స్
  పాల కూర, క్యాబేజీ, లెట్యూస్ వంటి వాటిలో ఫైబర్, పలు రకాల పోషకాలు ఎక్కువగా ఉంటాయని.. అవి జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులను పోగొట్టి, కడుపుబ్బరాన్ని తగ్గిస్తాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.

పుచ్చకాయ
దోసకాయల తరహాలోనే పుచ్చకాయల్లో కూడా కొన్ని రకాల పోషకాలు, నీటి శాతం ఎక్కువ. అంతేగాకుండా వీటిలో లైకోపీన్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇవి జీర్ణశక్తిని మెరుగుపర్చుతాయి.

స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీస్
  స్ట్రాబెర్రీలు, బ్లూ బెర్రీస్ తోపాటు ఇతర బెర్రీ జాతికి చెందిన పండ్లు యాంటీ ఆక్సిడెంట్లకు నిలయమని.. అవి కడుపు ఉబ్బరాన్ని సమర్థవంతంగా తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీలైతే వాటిని రోజూ కొంత మేర ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

పప్పు ధాన్యాలు
పప్పు ధాన్యాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందని, అది జీర్ణశక్తి మెరుగుపడేందుకు తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే బాగా రిఫైన్ చేసిన, పైపొర తొలగించి పాలిష్ చేసినవాటి కంటే.. ముడి పప్పు ధాన్యాలతో ప్రయోజనం ఎక్కువని స్పష్టం చేస్తున్నారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
నిద్రను నిర్లక్ష్యం చేస్తే గుండెకు మహా ముప్పు
 • రోజులో కనీసం 6-8 గంటలు నిద్రపోవాలి
 • లేదంటే గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదం
 • అధిక రక్తపోటు, మధుమేహం సమస్యలు
 • యువతలో పెరిగిపోతున్న ఈ తరహా కేసులు

ap7am

..ఇది కూడా చదవండి
ఆరోగ్యవంతులకు తక్కువ ధరకే ఆదిత్య బిర్లా హెల్త్ ప్లాన్
 • మంచి ఆరోగ్యం ఉంటే ప్రీమియంలో 10 శాతం డిస్కౌంట్
 • 35 ఏళ్లలోపు తీసుకుంటే 5-10 శాతం వరకు తగ్గింపు
 • బింగే రీఫిల్ ఫీచర్ తో అదనంగా 100 శాతం కవరేజీ

..ఇది కూడా చదవండి
సోషల్ మీడియా వినియోగం శృతి మించితే.. డిప్రెషన్
 • ఓ అధ్యయనంలో తేలిన విషయం
 • రోజులో 5 గంటల కంటే ఎక్కువ చూస్తే అనర్థాలు
 • ప్రతికూల భావనలు పెరుగుతాయంటున్న శాస్త్రవేత్తలు
 • వ్యక్తిగత సంబంధాలు తగ్గిపోతాయని హెచ్చరిక


More Latest News
KCR cutout near London bridge
ysrtp chief ys sharmila fires on jogipet mla kranti kiran
Chiranjeevi satires in speculators
ts minister harish rao drives a boat in siddipet komaticheruvu
Swathimuthyam Movie Team Interview
Low pressure in Bay Of Bengal as three days rain forecast for AP
Madhu Yaskhi fires on KCR
megastar chiranjeevi interesting comments on pawan kalyan and support to janasena
Bumrah reaction on ruled out from T20 World Cup
How to adopt retired army military dogs
Sridevi sarees from English Vinglish to be auctioned as film completes 10 years
KCR must have VRS says Jairam Ramesh
Indian Railways convyes 500 mail express trains into super fast category
komatireddy venkat reddy interesting post on munugode bypoll in social media
Redmi Pad launched in India with introductory price of Rs 12999
..more