పోలీసులకు దొరకకూడదని టెడ్డీబేర్​ లో దాక్కున్న దొంగ!

13-08-2022 Sat 15:20
UK police catch wanted thief hiding in teddy bear

అతనో దొంగ.. వయసు కూడా 18 ఏళ్లే.. పెద్ద పెద్ద కార్లు కొట్టేయడం దగ్గరి నుంచి సూపర్ మార్కెట్లలో సరుకులు కొట్టేయడం దాకా ఎన్నో కేసులు అతనిపై ఉన్నాయి. పోలీసులు అతడి కోసం సీరియస్ గానే వెతుకుతున్నారు. దీంతో తన ప్రేయసి ఇంటికి వెళ్లి దాక్కున్నాడు. పోలీసులకు ఇది తెలిసి, ఆ ఇంటిపై రైడ్ చేశారు.

పోలీసులు వస్తున్న విషయం తెలుసుకున్న సదరు దొంగ ఓ చిత్రమైన ప్లాన్ వేశాడు. ప్రేయసికి గతంలో తాను బహుమతిగా ఇచ్చిన ఐదు అడుగుల పెద్ద టెడ్డీబేర్ ను దీనికి వాడుకున్నాడు. టెడ్డీ బేర్ లోని దూది అంతా తీసేసి.. అందులో దూరాడు. టెడ్డీబేర్ ను ఓ మూల పడేసినట్టుగా వెళ్లి ఓ పక్కన కూర్చుండిపోయాడు. అయినా పోలీసులు పట్టేసుకున్నారు. ఇదంతా బ్రిటన్ లోని మాంచెస్టర్ లో జరిగింది. సదరు దొంగ పేరు జోషువా డాబ్సన్. మరి ఎలా దొరికిపోయాడో తెలుసా?

 జోషువా డాబ్సన్‌ ఇటీవల ఓ కారును దొంగతనం చేశాడు. ఆ కారులో పెట్రోల్ పోసుకుని బంకు నుంచి డబ్బులు కట్టకుండా పరారయ్యాడు. ఇంతకు ముందూ మనోడికి ఓ కారు దొంగతనం చేయడం, సూపర్ మార్కెట్లలో వస్తువులు ఎత్తుకుపోవడం వంటి ‘దొంగ’ చరిత్ర కూడా ఉంది. దాంతో పోలీసులు అతడి గురించి వెతుకులాట మొదలుపెట్టారు. ఇది తెలిసి వెళ్లి తన ప్రేయసి ఇంట్లో దాక్కున్నాడు. పోలీసులు అక్కడికీ రావడంతో టెడ్డీబేర్ లో దూరి కూర్చున్నాడు.

అంతా బాగానే ఉందిగానీ.. భయపడిపోయో, బాగా ఉద్వేగంలోనో గానీ గట్టిగా శ్వాస తీసుకోవడంతో టెడ్డీబేర్ ఛాతీ భాగం కదిలింది. గాలి ధ్వని వచ్చింది. అనుమానంతో పోలీసులు టెడ్డీ బేర్ ను పరిశీలిస్తే డాబ్సన్ పట్టుబడిపోయాడు. మాంచెస్టర్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీ ఫేస్‌ బుక్‌ లో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. ఏదేమైనా టెడ్డీ బేర్ దొంగ పాపులర్ అయిపోయాడు.

..Read this also
ఒక్క మొసలిని చూస్తేనే భయం.. అలాంటిది ఒకేచోట వందల మొసళ్లను చూస్తే.. వీడియో ఇదిగో
  • బ్రెజిల్ లోని సముద్ర తీరంలో ఒక్క చోట చేరిన మొసళ్లు
  • మనుషుల నుంచి నగరాన్ని ఆక్రమించుకునేందుకు మొసళ్లు వస్తున్నట్టుగా ఉందని కామెంట్లు
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో.. 80 లక్షలకుపైగా వ్యూస్

ap7am

..Read this also
కోమాలో ఉన్నాడని చెబుతూ ఏడాదిగా ఇంట్లోనే మృతదేహం.. ఇప్పటికీ బతికే ఉన్నాడంటున్న కుటుంబం!
  • ఉత్తరప్రదేశ్‌లోని రోషన్ నగర్‌లో ఘటన 
  • గతేడాది ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి
  • డెత్ సర్టిఫికెట్ కూడా ఇచ్చిన వైద్యులు
  • మృతదేహాన్ని మమ్మీలా మార్చి ఏడాదిగా ఇంట్లోనే పెట్టుకున్న కుటుంబం
  • మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వచ్చిన అధికారులతో వాగ్వివాదం

..Read this also
రోడ్డు దుస్థితిపై ఓపక్క వీడియో రిపోర్ట్ చేస్తుంటే.. మరోపక్క అక్కడి బురదలో ఆటో బోల్తా పడింది.. వైరల్ వీడియో ఇదిగో
  • రోడ్లు బాగో లేవని, ప్రమాదాలు జరుగుతున్నాయని వీడియో తీస్తున్న రిపోర్టర్
  • అదే సమయంలో అక్కడి గుంతల వల్ల బోల్తా పడిన ఆటో
  • ఉత్తర ప్రదేశ్ లోని బల్లియా ప్రాంతంలో ఘటన 


More Latest News
Minister Srinivas Goud says state govt helps Gymkhana stampede victims
POCSO case has to be filed on Pedavegi SI demands Anitha
Kishan Reddy criticizes CM KCR
TTD has assets countrywide
Its a matter of 5 mini to stop yatras says Botsa
BCCI election notification released
India will peace side says Jai Shankar
Karnataka former chief minister SM Krishna hospitalized with respiratory infection
Roja warns Nandamuri Balakrishna
Bathukammas at Uppa Stadium during India and South Africa T20
Russia advocates for permanent membership to India in UNSC
Godfather Grand Pre Release Event on 28th from 6 PM at Anantapur
BJP Satya Kumar fires on Jagan
GVL tweets on health university name change issue
Netflixs Rana Naidu teaser released
..more