ఒక రోజు ముందుగానే వస్తున్న ఫుట్​ బాల్​ మెగా టోర్నీ

12-08-2022 Fri 11:46
FIFA Officially Advances World Cup By A Day Tournament To Start On November 20

ఫిఫా వరల్డ్ కప్ వస్తుందంటే ఫుట్ బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. నాలుగేళ్లకోసారి జరిగే ఈ టోర్నీలో అత్యుత్తమ పోటీ ఫ్యాన్స్ ను ఎంతగానో అలరిస్తుంది. వరల్డ్ కప్ తేదీ ఖరారు కాగానే టోర్నీ జరిగే దేశానికి వెళ్లేందుకు అభిమానులు ప్లాన్ చేసుకుంటారు. విమాన టిక్కెట్లు, హోటల్ రూమ్స్ బుక్ చేసుకుంటారు. అయితే, ఈ సారి వాళ్లు తమ ప్లాన్స్ ను మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే  ఈ ఏడాది ఖతార్ వేదికగా జరగాల్సిన ఫిఫా వరల్డ్ కప్ ఒక రోజు ముందే మొదలవనుంది. 

ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం నవంబర్ 21న ఈ టోర్నీ మొదలవ్వాలి. కానీ, నవంబర్ 20వ తేదీనే ప్రారంభిస్తున్నట్టు ఫిఫా గురువారం అధికారికంగా ప్రకటించింది. ఫిఫా వరల్డ్ కప్ షెడ్యూల్లో మార్పు రావడం చాలా అరుదు. పాత షెడ్యూల్‌లో భాగంగా నవంబర్ 21న ఈక్వెడార్‌తో ఖతార్ అధికారిక ప్రారంభ మ్యాచ్‌ ఉండాల్సి ఉంది. 

కొత్త షెడ్యూల్ ప్రకారం ఆ రోజు సెనెగల్ తో నెదర్లాండ్స్‌ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈక్వెడార్ తో ఖతార్ తొలి మ్యాచ్ ను నవంబర్ 20వ తేదీకి మార్చారు. టోర్నీ ప్రారంభ తేదీలో మార్పు జరగడంతో ఆరంభ వేడుకలను కూడా ఒక రోజు ముందుగా నిర్వహిస్తారు. మారిన తేదీలకు తగ్గట్టు ఖతార్ రావాలనుకుంటున్న సాకర్ అభిమానులు తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాల్సి ఉంటుంది.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
టీమిండియా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటూ 2011 నాటి హెయిల్ స్టైల్‌లోకి మారిన‌ ధోని.. వీడియో ఇదిగో
 • 2007లో ప్రారంభ‌మైన టీ20 వ‌రల్డ్ క‌ప్‌
 • ధోనీ కెప్టెన్సీలో తొలి టైటిల్ విజేత‌గా నిలిచిన టీమిండియా
 • ఈ దఫా టీమిండియా టీ20 వ‌రల్డ్ క‌ప్‌ను గెల‌వాలంటూ ధోనీ వినూత్న ప్ర‌చారం
 • 2011లో వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌ను గెలిచిన ధోనీ
 • ఇప్పుడు నాటి హెయిర్ స్టైల్లోకి మారిపోయిన కెప్టెన్ కూల్‌

ap7am

..ఇది కూడా చదవండి
టీ20 వరల్డ్ కప్ కు దూరం కావడంపై బుమ్రా స్పందన
 • వీపునొప్పితో బాధపడుతున్న బుమ్రా
 • బుమ్రా టీ20 వరల్డ్ లో ఆడడంలేదన్న బీసీసీఐ
 • మెగా టోర్నీలో ఆడలేకపోవడం బాధగా ఉందన్న బుమ్రా
 • టీమిండియాకు తన ప్రోత్సాహం ఉంటుందని వెల్లడి

..ఇది కూడా చదవండి
విమానం మిస్స‌య్యాడ‌ని టీ20 ప్ర‌పంచ క‌ప్ జ‌ట్టు నుంచి త‌ప్పించారు
 • వెస్టిండీస్ బ్యాట‌ర్ షిమ్ర‌న్ హెట్‌మ‌య‌ర్ పై వేటు
 • అత‌ని స్థానంలో ష‌మారా బ్రూక్స్ కు చోటు
 • ఆస్ట్రేలియా వెళ్లాల్సిన విమానం అందుకోలేక‌పోవ‌డ‌మే కార‌ణం


More Latest News
Sensex closes 1277 points high
ms dhoni changes his hair style that looks in 2011 for team india victory in t20 world cup 2022
Madhya Pradesh home minister Narottam Mishra slams Adipurush team
KCR cutout near London bridge
ysrtp chief ys sharmila fires on jogipet mla kranti kiran
Chiranjeevi satires in speculators
ts minister harish rao drives a boat in siddipet komaticheruvu
Swathimuthyam Movie Team Interview
Low pressure in Bay Of Bengal as three days rain forecast for AP
Madhu Yaskhi fires on KCR
megastar chiranjeevi interesting comments on pawan kalyan and support to janasena
Bumrah reaction on ruled out from T20 World Cup
How to adopt retired army military dogs
Sridevi sarees from English Vinglish to be auctioned as film completes 10 years
KCR must have VRS says Jairam Ramesh
..more