ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ కడ్ చేత ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

11-08-2022 Thu 12:45
Jagdeep Dhankhar takes oath as Vice President of India

భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ కడ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో ప్రమాణస్వీకార కార్యక్రమం కొనసాగింది. ఉపరాష్ట్రపతితో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఇంకా మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా విచ్చేశారు. 

ఆగస్ట్ 6న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరపున పోటీ చేసిన ధన్ కడ్ విపక్షాలు మద్దతు పలికిన మార్గరెట్ అల్వాను ఓడించారు. ధన్ కడ్ కు 74.36 శాతం ఓట్లు వచ్చాయి. 1997 నుంచి జరిగిన చివరి ఆరు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇదే అత్యధిక మెజార్టీ కావడం గమనార్హం. 

ఇక ధన్ కడ్ కు ఏన్డీయేతర పార్టీలు కూడా మద్దతు ప్రకటించడం విశేషం. వీటిలో నవీన్ పట్నాయక్ కు చెందిన బిజూ జనతాదళ్, వైసీపీ, మాయావతికి చెందిన బీఎస్పీ తదితర పార్టీలు ఉన్నాయి. మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ ఓటింగ్ కు దూరంగా ఉంది.  

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
జేఈఈ మెయిన్ పరీక్ష పత్రం లీక్ కేసులో రష్యా జాతీయుడి అరెస్ట్
  • గతేడాది జేఈఈ పరీక్షల సాఫ్ట్ వేర్ ట్యాంపరింగ్
  • రష్యా జాతీయుడు మిఖాయిల్ షార్గిన్ పై ఆరోపణలు
  • సీబీఐ దర్యాప్తు
  • భారత్ ను వీడి వెళ్లిపోయిన మిఖాయిల్ షార్గిన్
  • లుకౌట్ నోటీసులు జారీ చేసిన సీబీఐ

ap7am

..ఇది కూడా చదవండి
నోరూరించే రుచులతో ఎయిరిండియా విమానాల్లో కొత్త మెనూ
  • టాటా గ్రూప్ సొంతమైన ఎయిరిండియా
  • ఎయిరిండియాకు కొత్త రూపు తెచ్చేందుకు ప్రయత్నం
  • వివిధ రకాల వంటకాలతో పండుగ సీజన్ మెనూ
  • బిజినెస్, ఎకానమీ క్లాస్ ప్రయాణికుల కోసం భిన్నమైన మెనూలు

..ఇది కూడా చదవండి
భారత వాయుసేన చేతికి 'ప్రచండ్' హెలికాప్టర్లు
  • దేశీయంగా తయారైన పోరాట హెలికాప్టర్లు
  • అభివృద్ధి చేసిన హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
  • 'ప్రచండ్' గా నామకరణం
  • హెలికాప్టర్లను వాయుసేనలో చేర్చిన రాజ్ నాథ్ సింగ్


More Latest News
SP Balu statue removed in Guntur
Vitamin C helps shiny skin
CBI arrests Russian national in JEE software tampering issue
Bumrah ruled out of T20 World Cup
New menu in Airindia domestic planes
National Green Tribunal imposes huge penalty on Telangana govt
KA Paul starts indefinite hunger strike
AP CM Jagan conveys best wishes in advance for Vijaya Dashami
Venkaih Naidu visits Nellore along with Lok Sabha speaker Om Birla
Chiranjeevi God Father title song out now
Dasara lyrical song released
Hyderabad man set his bike on fire after police stopped him
Team India rested Kohli and KL Rahul
More flood water towards Vijayawada Prakasam Barrage
Royal Enfield September sales up by 145 percent
..more