'నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో నీతి ఆయోగ్ లో నీతి కూడా అంతే' అంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మంత్రి కేటీఆర్ రిప్లై

08-08-2022 Mon 14:08
That Is why CM KCR chose to express dissent by Boycotting NITI AAYOG says KTR

నీతి ఆయోగ్ గురించి తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో నీతి ఆయోగ్ లో నీతి కూడా అంతే అని ఎద్దేవా చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గైర్హాజరయ్యారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

కేసీఆర్ భేటీకి వెళ్లి ఉండాల్సిందని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. ‘సంధి కుదరదని తెలిసి శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్లిన మహాభారతం నుండి కేసీఆర్ స్ఫూర్తి పొందాల్సింది.  ప్రధానమంత్రి, సీఎం సమక్షంలో జరిగిన సమావేశంలోనే నీతి ఆయోగ్‌ని సీఎం ప్రశ్నించాల్సి ఉంది’ అని నాగేశ్వర్ ట్వీట్ చేశారు.

దీనికి మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. ‘‘అయినను పోయి రావలె హస్తినకు” అనేది పాత సామెత నాగేశ్వర్ గారు అంటూ రిప్లై ఇచ్చారు. ‘ఈ కేంద్ర ప్రభుత్వం ఒక పక్షపాత, వివక్ష పూరితమైన మనస్తత్వంతో గతంలో నీతి ఆయోగ్ సిఫార్సు బుట్టదాఖలు చేసింది. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో నీతి ఆయోగ్ లో నీతి కూడా అంతే’ అని ట్వీట్ చేశారు. అందుకే సీఎం కేసీఆర్ నీతి ఆయోగ్ భేటీని బాయ్ కాట్ చేశారని కేటీఆర్ స్పష్టం చేశారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
కోమటిచెరువులో బోటు నడిపిన హరీశ్ రావు.. తామర పువ్వు తెంపి భార్యకు అందించిన మంత్రి.. వీడియో ఇదిగో
  • సిద్దిపేట కోమ‌టిచెరువులో హ‌రీశ్ రావు ఆట‌విడుపు
  • భార్యాపిల్ల‌ల‌తో క‌లిసి బోటు షికారుకు వెళ్లిన వైనం
  • వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన హ‌రీశ్ రావు పీఏ

ap7am

..ఇది కూడా చదవండి
80 యూనిట్లు, ఒక్కో యూనిట్ కు ఒక్కో ఎమ్మెల్యే ఇంఛార్జ్... మునుగోడు ఉప ఎన్నికకు కేసీఆర్ భారీ ప్లాన్
  • జాతీయ పార్టీని ప్రారంభించబోతున్న కేసీఆర్
  • మునుగోడు ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ అధినేత
  • దసరా మరుసటి రోజు నుంచి నేతలంతా మునుగోడులోనే

..ఇది కూడా చదవండి
మునుగోడు ఉప ఎన్నికలో ఘన విజయం సాధిస్తాం: జగదీశ్ రెడ్డి
  • మునుగోడు ఉప ఎన్నికకు టీఆర్ఎస్ సిద్ధంగా ఉంది
  • బీజేపీకి మునుగోడు ప్రజలు బుద్ధి చెపుతారు
  • కేసీఆర్ ను ఓడించడం ఎవరి వల్ల కాదు


More Latest News
ysrtp chief ys sharmila fires on jogipet mla kranti kiran
Chiranjeevi satires in speculators
ts minister harish rao drives a boat in siddipet komaticheruvu
Swathimuthyam Movie Team Interview
Low pressure in Bay Of Bengal as three days rain forecast for AP
Madhu Yaskhi fires on KCR
megastar chiranjeevi interesting comments on pawan kalyan and support to janasena
Bumrah reaction on ruled out from T20 World Cup
How to adopt retired army military dogs
Sridevi sarees from English Vinglish to be auctioned as film completes 10 years
KCR must have VRS says Jairam Ramesh
Indian Railways convyes 500 mail express trains into super fast category
komatireddy venkat reddy interesting post on munugode bypoll in social media
Redmi Pad launched in India with introductory price of Rs 12999
Jio announces limited period festive offer with up to Rs 4500 benefits
..more