ఈ పదిహేను ఆహార పదార్థాలతో గ్యాస్ సమస్య!
30-07-2022 Sat 16:52 | Health
- పలు రకాల కూరగాయలు, పప్పు పదార్థాలతో గ్యాస్ట్రిక్ సమస్య
- తిన్నది సరిగా అరిగితే గ్యాస్ సమస్య ఉండదంటున్న నిపుణులు
- మొదట ఆహారం సరిగా జీర్ణమయ్యేందుకు తోడ్పడే ఆహారం తీసుకోవాలని సూచన

గ్యాస్ సమస్య లేదా గ్యాస్ట్రిక్ సమస్య.. ఎలా పిలిచినా ఈ మధ్య చాలా మంది ఈ ఇబ్బందితో బాధపడుతున్నారు. పెద్దా చిన్నా వయసుతో సంబంధం లేకుండా గ్యాస్ సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. దీనికి మారిన ఆహార అలవాట్లు, సరైన సమయ పాలన లేకపోవడం, మసాలాలు ఎక్కువగా వాడటం, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఐటమ్స్ ఎక్కువగా తింటుండటం, సరిగా నిద్ర లేకపోవడం, ఆల్కహాల్ అలవాటు వంటి ఎన్నో కారణాలు ఉన్నాయని ప్రఖ్యాత పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ వెల్లడించారు.
ఈ పదార్థాలతో ఎక్కువగా..
- పోషకాహార నిపుణులు చెప్పిన ప్రకారం.. బాగా ఫ్రై చేసిన ఆహారం ఏదైనా గ్యాస్ట్రిక్ సమస్యకు దారి తీస్తుంది.
- సాధారణంగా కూరగాయలేవైనా మంచి ఆరోగ్యానికి తోడ్పడుతాయి. అయితే కొన్ని రకాల కూరగాయలు గ్యాస్ట్రిక్ సమస్యకు దారి తీస్తాయి. ముఖ్యంగా వంకాయ, దోసకాయ, క్యాబేజీ, కాలిఫ్లవర్, ఆకుపచ్చ బఠానీ, ర్యాడిష్ (ముల్లంగి) వంటి వాటికి గ్యాస్ ఉత్పత్తికి కారణమయ్యే లక్షణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
- మైదా, సోయాబీన్స్, యీస్ట్, పాలు, శనగలు, రాజ్మా, నట్స్, పేస్ట్రీలు వంటివి గ్యాస్ సమస్యకు ఎక్కువగా దారి తీస్తాయి.
- ఆల్కహాల్ కూడా గ్యాస్ట్రిక్ సమస్యను పెంచుతుంది. ముఖ్యంగా బీర్ వల్ల ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.
జీర్ణశక్తిని పెంచుకుంటే..
శరీరానికి మేలు చేసే ఆహారంతోనూ గ్యాస్ సమస్య ఉండటం సాధారణమేనని, అయితే జీర్ణ శక్తిని పెంచుకోగలగడం వల్ల ఈ బాధ నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. జీర్ణశక్తి ఎంత బాగా మెరుగుపడితే.. గ్యాస్ సమస్య అంతగా తగ్గిపోతుందని స్పష్టం చేస్తున్నారు. ప్రోబయాటిక్, ప్రిబయాటిక్ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుందని సూచిస్తున్నారు.
మానసిక సమస్యలూ కారణమే..
మన శరీరంలో జీర్ణాశయ సంబంధిత సమస్యలు, గ్యాస్ కు మానసిక సమస్యలూ కారణమేనని నిపుణులు చెబుతున్నారు. మానసిక ఒత్తిడి ( స్ట్రెస్), టెన్షన్, యాంగ్జైటీ వంటివి గ్యాస్ట్రిక్ సమస్యకు దారి తీస్తాయని అంటున్నారు. మానసిక సమస్యలను నియంత్రణలో పెట్టుకోవడం గ్యాస్ట్రిక్ సమస్యనూ తగ్గిస్తుందని వివరిస్తున్నారు.
More Latest News
తీవ్ర ఉత్కంఠ.. మూడు రాజధానులపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ
12 minutes ago

బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించాలంటూ గవర్నర్ ను స్వయంగా ఆహ్వానించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి
11 hours ago

వాయుగుండం.. రేపు ఏపీకి వర్ష సూచన
11 hours ago
