-->

శ్రీలంక అధ్యక్ష, ప్రధానమంత్రి భవనాల నుంచి 1000కి పైగా కళాఖండాలు మాయం

24-07-2022 Sun 07:04 | International
Over 1000 artefacts missing from Sri Lankas Presidential Palace and PM house

ఇటీవల శ్రీలంక అధ్యక్ష, ప్రధానమంత్రుల నివాసాల్లోకి దూసుకెళ్లిన నిరసనకారులు విలువైన, అత్యంత పురాతనమైన కళాఖండాలను మాయం చేసినట్టు తాజాగా పోలీసులు వెల్లడించారు. ఈ రెండు భవనాల నుంచి వెయ్యికి పైగా కళాఖండాలు మాయమైనట్టు పోలీసులను ఉటంకిస్తూ స్థానిక వార్తాసంస్థ ఒకటి పేర్కొంది. ఈ ఘటనపై దర్యాప్తు కూడా ప్రారంభమైనట్టు తెలిపింది. మాయమైన కళాఖండాలకు సంబంధించిన రికార్డులు పురావస్తు శాఖ వద్ద లేకపోవడం అధికారులకు సమస్యగా మారిందని తెలిపింది. అంతేకాదు, 1000కి పైగా వస్తువులు మాయమైనట్టు చెబుతున్నప్పటికీ కచ్చితంగా ఎన్ని ఉంటాయన్న దానిపై ఓ నిర్ధారణకు రాలేకపోతున్నట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 

అధ్యక్ష, ప్రధానమంత్రి భవనాల్లోకి నిరసనకారులు చొచ్చుకెళ్లడంపై తాజా అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే మాట్లాడుతూ.. ఇలా ప్రభుత్వ భవనాలను నిరసనకారులు ఆక్రమించడాన్ని తాను సమర్థించబోనని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలను నిరోధించేందుకు పోలీసులకు, సాయుధ బలగాలకు అన్ని అధికారాలు  ఇచ్చినట్టు తెలిపారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
మా దేశానికి రండి.. మోదీకి అమెరికా అధ్యక్షుడి ఆహ్వానం
  • బైడెన్ ఆహ్వానాన్ని మోదీ మన్నించారన్న పీఎంవో
  • త్వరలోనే అమెరికాలో మోదీ పర్యటిస్తారని వెల్లడి
  • సెప్టెంబర్ లో జి 20 సదస్సు కోసం బైడెన్ ఇండియా టూర్

ap7am

..ఇది కూడా చదవండి
పేపాల్​లో 2 వేల మంది ఉద్యోగుల తొలగింపు
  • టెక్ కంపెనీల్లో కొనసాగుతున్న ఉద్యోగ కోతల పర్వం
  • సంస్థలో 7 శాతం మందిపై ఈ ప్రభావం ఉంటుందన్న పేపాల్
  • కార్యాలయాలనూ మూసి ఖర్చులు తగ్గించుకోవాలని నిర్ణయం

..ఇది కూడా చదవండి
ప్రార్థనలు చేస్తున్న వారిని ఇండియాలో ఎప్పుడూ చంపలేదు.. పాకిస్థాన్‌లోనే అలా జరుగుతోంది: పాక్ మంత్రి
  • పెషావర్‌ మసీదులో జరిగిన పేలుడులో 100 మంది మృతి
  • ఇలాంటి ఘటనలు పాకిస్థాన్‌లో తప్ప మరెక్కడా జరగవని మంత్రి ఆవేదన
  • హౌస్ ఏకమై ఉగ్రవాదంపై చర్చలు జరపాలని పిలుపు
  • శాంతి స్థాపన జరగాల్సిందేనన్న మంత్రి


More Latest News
India wins T20 series against New Zealand
Kodali Nani comments on Kotamreddy
Nara Lokesh padaya 6th day
Subhman Gill century in t20 against New Zealand
Chidambaram comments on Union budget
Ram Mohan Naidu fieres on Jagan
Shakunthalam lyrical song release
Balineni response on Kotamreddy Phone tapping allegations
Amigos movie update
31 YSRCP MPs does not did any thing for AP in union budget says Chandrababu
YSRCP MP Mithun Reddy response on Union budget
Sasivadane lyrical song released
Perni Nani on phone tapping issue
Jagan key meeting with Sajjala and police amid Kotamreddy phone tapping allegations
Nirmala Sitharaman press meet after budget announcement
..more