టెస్లా ఎలక్ట్రిక్ కార్ల రికార్డ్.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కు చేరిక

18-07-2022 Mon 10:57
Tesla Model X and Model Y EVs reach Mount Everest base camp

ఎలక్ట్రిక్ వాహనాల్లో టెస్లా బ్రాండ్ ప్రత్యేకతే వేరు, అత్యాధునిక టెక్నాలజీ, సామర్థ్యానికి టెస్లా ఎలక్ట్రిక్ కార్లు ప్రతీకగా ఉంటాయి. ఇప్పుడు టెస్లా ఎలక్ట్రిక్ కార్లు ఒక అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్నాయి. టెస్లా మోడల్ ఎక్స్, మోడల్ వై ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్ ను చేరుకున్నాయి. చెంగ్డు నుంచి ఐదు రోజుల పాటు 2,414 కిలోమీటర్లు ప్రయాణించిన టెస్లా కార్లు.. సముద్ర మట్టానికి 17,060 అడుగుల ఎత్తయిన ప్రదేశానికి చేరాయి.

టెస్లా కార్ల సామర్థ్యాన్ని నిరూపించడానికి ఓ టెస్లా కారు యజమాని ఈ ఫీట్ చేశాడు. చైనాకు చెందిన వ్లోగర్ ట్రెన్ సెన్ చాంగ్ కింగ్ టెస్లా మోడల్ వై కారు యజమాని. అతడితోపాటు, అతడి స్నేహితుడు టెస్లా మోడల్ ఎక్స్ తో మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకున్నారు. నిజానికి సంప్రదాయ ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్లతో ఉన్న వాహనాలు సైతం ఇక్కడకు చేరడానికి అవస్థ పడుతుంటాయి. అలాంటిది టెస్లా కార్లు అవలీలగా ఎత్తయిన ప్రాంతాన్ని అధిరోహించడం గమనార్హం. 

  ఈ ఇద్దరి ప్రయాణానికి సంబంధించి వీడియోను టెస్లా చైనా షేర్ చేసింది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి వీలుగా టెస్లా కార్లలో కొన్ని మార్పులు కూడా చేశారు. మార్గంలో టెస్లా సూపర్ చార్జర్ నెట్ వర్క్ ను కూడా నెలకొల్పారు. ఈ ఇద్దరు దారి పొడవునా తొమ్మిది సార్లు చార్జింగ్ పెట్టుకున్నారు. అంటే ఒక్కో చార్జింగ్ తో 257 కిలోమీటర్లు ప్రయాణించారు. 

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
ప్రస్తుత సంక్షోభాన్ని సైనిక చర్యతో పరిష్కరించలేరు: జెలెన్ స్కీతో ఫోన్ లో సంభాషించిన ప్రధాని మోదీ
  • ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడిన మోదీ
  • చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచన
  • శాంతి ప్రయత్నాలకు భారత్ సిద్ధమని వెల్లడి
  • అణుకేంద్రాల భద్రతపై ఆందోళన

ap7am

..ఇది కూడా చదవండి
మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడిన ఉత్తర కొరియా... జపాన్ మీదుగా దూసుకెళ్లేలా క్షిపణి ప్రయోగం
  • బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా
  • జపాన్ మీదుగా వెళ్లి పసిఫిక్ మహాసముద్రంలో పడిన వైనం
  • ప్రజలను అప్రమత్తం చేసిన జపాన్
  • సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టిన అమెరికా, జపాన్

..ఇది కూడా చదవండి
దుబాయ్ లో 16 మంది దేవతామూర్తులతో భారీ హిందూ ఆలయం... నేడు ప్రారంభం
  • అరబ్ గడ్డపై హిందూ దేవాలయం
  • 80 వేల చదరపు అడుగుల్లో ఆలయ నిర్మాణం
  • 2019లో స్థలం కేటాయించిన యూఏఈ ప్రభుత్వం
  • మూడేళ్లలో నిర్మాణం పూర్తి


More Latest News
Nitin Menon Among 16 Umpires Named For T20 World Cup In Australia
 Garba event cops thrash suspects by holding them against electric pole
Team India lost third T20 match by 49 runs
Guntur commissioner explains why the remove SP Balu statue
If you can pay some fee you can spend in this jail
rishab panth scores 27 runs on his birth day
ysrcpp leader vijay sai reddy appointed as Parliamentary Standing Committee chairman
EC proposals on freebies
justice n v ramana attends tirumala bramhostavam
Rossouw lighting hundred drives SA for a mammoth score
Modi talks to Ukraine president Zelensky
subbarami reddy interesting comments on ravanth reddy
North Korea test fires another ballistic missile that flew over Japan
Mohammed Shami replaces jaspreet bymrah in t20 world cup
Russian hacker helps to cheat in JEE Main exam last year
..more