బియ్యం ఇస్తున్నది కేంద్రమే.. వైసీపీ ప్రభుత్వం కాదు: సీఎం రమేశ్

14-07-2022 Thu 14:37
Centre is giving free rice to poor sasy CM Ramesh

వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ విమర్శలు గుప్పించారు. పేదల ఆకలి కేకలు వైసీపీ ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. రాష్ట్రంలోని పేదలకు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తున్నది కేంద్ర ప్రభుత్వమేనని చెప్పారు. అయినప్పటికీ బియ్యాన్ని తామే పంపిణీ చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటోందని విమర్శించారు. పేదల సంక్షేమాన్ని విస్మరించి ప్రభుత్వాలు మనుగడ సాగించిన దాఖలాలు లేవని చెప్పారు. 

విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం సర్వశిక్షా అభియాన్ పథకాన్ని విద్యా కానుకగా అందిస్తోందని సీఎం రమేశ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు జగన్ స్టిక్కర్ వేసుకుని తామే అమలు చేస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. పబ్లిసిటీ కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది అరాచకాలు, అక్రమాలు, దోపిడీలు తప్ప... చేసిన అభివృద్ధి ఏమీ లేదని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని అన్నారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర వాయిదా
 • మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల
 • ఉప ఎన్నికపై ఫోకస్ చేయనున్న బండి సంజయ్
 • రేపటి నుంచి మునుగోడులో మకాం వేయనున్న బీజేపీ కీలక నేతలు

ap7am

..ఇది కూడా చదవండి
గుజరాత్‌లో కేజ్రీవాల్‌కు దక్కేవి రెండు సీట్లేనట: ఏబీపీ న్యూస్-సీఓటర్ సర్వే
 • డిసెంబరులో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు
 • వరుసగా ఏడోసారి కూడా బీజేపీదే విజయమన్న ఒపీనియన్ పోల్
 • ఎన్నికల్లో ఆప్ ప్రభావం ఉంటుందని తేల్చిన వైనం
 • కాంగ్రెస్‌కు గరిష్ఠంగా 44 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉందని అంచనా
 • బీజేపీకి మాత్రం 143 స్థానాలు వస్తాయంటున్న ఒపీనియన్ పోల్

..ఇది కూడా చదవండి
న‌వంబ‌ర్‌లో మునుగోడు ఉప ఎన్నిక‌: బీజేపీ నేత సునీల్ బ‌న్స‌ల్‌
 • చౌటుప్ప‌ల్‌లో బీజేపీ నేత‌ల‌తో సునీల్ బ‌న్స‌ల్ భేటీ
 • మునుగోడు ఉప ఎన్నిక‌ల‌పై కీల‌క చ‌ర్చ‌
 • ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌యం సాధిస్తుంద‌న్న బ‌న్స‌ల్‌
 • ఇంచార్జీలంతా నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉండాల‌ని ఆదేశం


More Latest News
Teacher drinking beer while teaching students in UP
markets ends in losses
Nobel Prize in medicine goes to Sweden born Svante Paabo
Praveen Sattharu Interview
CM KCR talks to Akilesh Yadav over Mulayam Singh Yadav health
Roja visits Vizag Swaroopanandrendra peetam
Karnataka man tries to kiss cobra after rescuing it gets bitten
Minister Mutyala Naidu fires on TDP leader Ayyanna Patrudu
Maoists can kill corrupted TRS leaders in 10 minutes says Gone Prakash Rao
Onion may help manage blood sugar levels
Moto G72 launched in India with 108MP triple rear camera system
Huge response for Prabhas Adipurush Hindi teaser
Chandrababu responds to girl students Ganja addiction in Vijayawada
Bandi Sanjay pada yatra postponed due to Munugode by poll
Kriti Sanon offers her dupatta to Prabhas to wipe his sweat with at Adipurush teaser launch Watch video
..more