/

రైతుల్ని నిండా ముంచేసింది ఈ ప్రభుత్వం... మళ్లీ రైతు దినోత్సవాలా?: వైసీపీ సర్కారుపై సోమిరెడ్డి విమర్శలు

08-07-2022 Fri 17:16
Somireddy fires on YCP Govt

రాష్ట్రంలోని రైతులను నిండా ముంచేసింది వైసీపీ ప్రభుత్వమేనని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలను నిలిపివేశారని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ రైతు దినోత్సవాలంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

"రైతులందరూ బాగుండాలనే మేం కోరుకుంటాం. రైతు దినోత్సవం జరిపే అర్హత వైసీపీకి లేదు. ఈ మూడేళ్లలో రైతులు కుప్పకూలిపోయారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వమే ఆపేయడం ఎంత అన్యాయం? సూక్ష్మ నీటి పారుదల రంగానికి టీడీపీ హయాంలో ఏటా రూ.1200 కోట్లు ఖర్చు చేశాం. ఈ మూడేళ్లలో మీరెంత ఖర్చు చేశారు? అసలు, పథకాన్నే ఆపేశారు. 

భూసార పరీక్షలు చేసి, సూక్ష్మపోషకాలైన జింకు, జిప్సం, బోరాన్ ఉచితంగా అందించే పథకం అమలు చేశాం.  దీన్ని కూడా ఆపేశారు. కేంద్ర-రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి యాంత్రీకరణ పథకాన్ని కూడా ఆపేశారు. ఈ పథకానికి ఏడాదికి రూ.400 కోట్లు ఖర్చు చేశాం. రైతు రథం కింద రెండేళ్లలో 23 వేల ట్రాక్టర్లు ఇచ్చాం. దీన్ని కూడా నిలిపేశారు. మీకసలు రైతు దినోత్సవం గురించి మాట్లాడే అర్హత ఉందా? అని ప్రశ్నిస్తున్నా. 

9 గంటల కరెంటును 12 గంటలు ఇస్తానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి 7 గంటలు చేశాడు. దాంట్లోనూ కోతలే. పంటలకు మద్దతు ధరలే లేవు. ఏపీ రైతులు మద్దతు ధరలు కోల్పోయారని కేంద్ర సంస్థ కూడా చెప్పింది. ఒక్క నెల్లూరు జిల్లాలోనే రైతులు మద్దతు ధర విషయంలో రూ.3 వేల కోట్లు నష్టపోయారు" అని వివరించారు. 

వ్యవసాయ రంగానికి బడ్జెట్ లో ఎంత కేటాయించారో శ్వేతపత్రం విడుదల చేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. సాక్షి పేపర్లో తప్పుడు ప్రకటనలు ఇవ్వడం కాదు, వాస్తవాలు వెల్లడించాలని స్పష్టం చేశారు. లేకపోతే రైతులందరూ తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారని సోమిరెడ్డి హెచ్చరించారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
తన దోపిడీ ఎవరికీ తెలియదని జగన్ అనుకున్నాడు... కానీ ప్రజలకు తెలిసిపోయింది: చంద్రబాబు
  • బాపట్లలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి
  • సీఎం జగన్ పాలనపై బాబు విమర్శనాస్త్రాలు
  • ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ ఇంటికేనని వెల్లడి

ap7am

..ఇది కూడా చదవండి
కేసీఆర్ చెప్పాడని పోలవరం ఎత్తు తగ్గించడానికి సిద్ధమైనప్పుడే జగన్ భాగోతం బయటపడింది: దేవినేని ఉమ
  • పోలవరంపై దేవినేని ఉమ జూమ్ ప్రెస్ మీట్
  • జగన్ చేతగాని దద్దమ్మ అంటూ వ్యాఖ్యలు
  • పోలవరంపై చేతులెత్తేశాడని ఎద్దేవా

..ఇది కూడా చదవండి
జగన్ రెడ్డిలా మోసం చెయ్యను... దుల్హన్ పథకం కింద రూ. లక్ష చెల్లిస్తా: చంద్రబాబు
  • పొన్నూరులో ముస్లిం మైనారిటీలతో సమావేశం
  • చంద్రబాబుతో సమస్యలు చెప్పుకున్న మైనారిటీలు
  • ముస్లింలకు అనేక ప్రయోజనాలు కలిగించామన్న చంద్రబాబు
  • మళ్లీ అధికారంలోకి వస్తే ఇంకా మేలు చేస్తామని హామీ  


More Latest News
C Kalyan opines on theaters issue
Gurthunda Seetakalam Review
Chandrababu take a swipe at CM Jagan
Mandous barrels towards North Tamilnadu and South Coastal Andhra
Police rescues kidnapped dental doctor Vaishali
Jogi Ramesh satires on Pawan Kalyan bus Varahi
Sea comes forth in Mypadu beach
Ravi Teja first look teaser will be out now on December 12
Panchatantram movie review
Pawan flurry of tweets targeted YCP
Devineni Uma fires on CM Jagan over Polavaram
100 men kidnap a woman in Rangareddy district
Kodali Nani once again fires on TDP leaders
Tides intensifies at Uppada beach due to Cyclone Mandouse
KCR support is there for Sajjala comments says Revanth Reddy
..more