రోడ్డు ప్రమాద బాధితుడిని సకాలంలో ఆసుపత్రికి తరలించిన రాహుల్ గాంధీ... వీడియో ఇదిగో!
03-07-2022 Sun 18:51
- వయనాడ్ లో పర్యటించిన రాహుల్ గాంధీ
- హోటల్ కు వెళ్లే దారిలో రోడ్డు ప్రమాదం
- వ్యక్తిని ఢీకొట్టిన బైక్
- తన కాన్వాయ్ లోని అంబులెన్స్ ను రప్పించిన రాహుల్

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిన్న తన నియోజకవర్గం వయనాడ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ రోడ్డు ప్రమాద బాధితుడిని సకాలంలో ఆదుకున్నారు. నియోజకవర్గంలో పర్యటన ముగించుకుని తాను బస చేసిన హోటల్ కు వెళుతుండగా, మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదం జరగడాన్ని రాహుల్ గాంధీ గమనించారు. ఓ వ్యక్తిని బైక్ ఢీకొట్టగా, ఆ వ్యక్తికి గాయాలయ్యాయి.
వెంటనే తన వాహనం నుంచి దిగిన రాహుల్ గాంధీ బాధితుడి పరిస్థితిని అంచనా వేశారు. వెంటనే తన కాన్వాయ్ లో ఉన్న అంబులెన్స్ ను రప్పించి ఆ క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించేందుకు చొరవ తీసుకున్నారు. బాధితుడికి ప్రథమచికిత్స చేసిన అనంతరం ఆ అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. ఈ సందర్భంగా రాహుల్ మానవతా దృక్పథంపై నెటిజన్ల నుంచి అభినందల జల్లు కురుస్తోంది.
More Latest News
ఇంతటి భిన్నత్వంలోనూ సమర్థంగా నెట్టుకువస్తున్న భారత్ వైపు యావత్ ప్రపంచం చూస్తోంది: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
22 minutes ago

బ్యాంకును దోచేద్దామని.. సొరంగం తవ్వుతుంటే ప్రమాదం
49 minutes ago

ఢిల్లీ రోడ్డుపై బిచ్చగాడు... పెద్ద మోడల్ లా ఉన్నాడు.. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఇదిగో!
1 hour ago

వీఎల్ సీ మీడియా ప్లేయర్ పై దేశంలో నిషేధం
1 hour ago

‘వారు దేశ విభజన సమయంలో దృఢంగా నిలబడ్డారు..’ నాటి హింసలో చనిపోయినవారికి ప్రధాని మోదీ నివాళులు
2 hours ago
