జగన్ జనానికి ఎదురొచ్చినా... జనమే ఎదురెళ్లినా జనానికే రిస్కు: నారా లోకేశ్

03-07-2022 Sun 13:45
nara lokesh satires on ys jagan on twitter

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ఆదివారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. మా ఇంటికి వ‌స్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వ‌స్తే ఏమి ఇస్తారు అన్న చందంగా జ‌గ‌న్ వ్య‌వ‌హారం ఉంటోంద‌ని ఆయ‌న ఆరోపించారు. వ‌లంటీర్ల‌కు ప్ర‌భుత్వం నుంచి అందిస్తున్న సౌక‌ర్యాల‌పై వ‌రుస ట్వీట్ల‌ను పోస్ట్ చేసిన లోకేశ్‌... సాక్షి ప‌త్రిక వేయించుకునేందుకు కూడా వలంటీర్ల‌కు జ‌గ‌న్ స‌ర్కారు నిధులు కేటాయించింద‌ని ఆరోపించారు.

జనం సొమ్మును దోచేందుకు జ‌గ‌న్ అండ్ కో ఆడ‌ని నాట‌క‌మే లేద‌ని ఆరోపించిన లోకేశ్.. వైసీపీ కార్యక‌ర్త‌ల‌ను వ‌లంటీర్లుగా పెట్టుకుని పార్టీ కోసం ప‌నిచేయిస్తూ ప్ర‌జా ధనాన్ని ధార‌పోస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. వైసీపీ కార్యకర్తలైన వలంటీర్లకు రూ.233 కోట్లతో సెల్ ఫోన్లు కొనిచ్చిన జ‌గ‌న్‌.. ఇప్పుడు జనం సొమ్ము సొంతానికి ఎలా వాడుకోవాలనే అత్యాశతో మరో ఆర్డర్ తెచ్చారని దుమ్మెత్తిపోశారు. 

ఖజానాలో డబ్బులు లేవని ప్రజాసంక్షేమ పథకాలు ఆపేసిన ప్రభుత్వం.. రూ.300 కోట్లతో సాక్షి ప‌త్రిక‌కు ప్రకటనలు ఇచ్చిందని లోకేశ్ ఆరోపించారు. అక్కడితో ఆగకుండా రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్లు సంక్షేమ కార్యక్రమాల గురించి తెలుసుకోవాలంటే సాక్షి ప‌త్రిక‌ను వేయించుకోవాలని ఆదేశించిన జ‌గ‌న్‌.. అందుకోసం నెలకు రూ.5.32 కోట్లు విడుద‌ల చేస్తున్న‌ట్లు ఉత్త‌ర్వులు ఇచ్చార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇలా వలంటీర్లు సాక్షి ప‌త్రిక‌ను చ‌దివేందుకే జ‌గ‌న్ స‌ర్కారు ఏడాదికి 63.84 కోట్లు ఖ‌ర్చు చేస్తోంద‌ని ఆరోపించారు. జనం సొమ్ము జలగలా పీల్చేస్తున్న జగన్ జనానికి ఎదురొచ్చినా...జనమే ఆయ‌న‌కు ఎదురెళ్లినా జనానికే రిస్కు అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.

..Read this also
కొండప‌ల్లి న‌గ‌ర పంచాయ‌తీలో కేశినేని ఓటు హక్కు వినియోగంపై పిల్‌కు విచార‌ణ అర్హ‌త ఉంది: ఏపీ హైకోర్టు
 • కొండ‌ప‌ల్లి న‌గ‌ర పంచాయ‌తీ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీల మ‌ధ్య విభేదాలు
 • ఎంపీ కేశినేని నాని ఓటు హ‌క్కు వినియోగంపై ఇరువ‌ర్గాల వాద‌న‌లు
 • కొండ‌ప‌ల్లిలో త‌న ఓటు హ‌క్కు వినియోగంపై తేల్చాల‌ని నాని పిల్‌
 • పిల్‌కు విచార‌ణ అర్హ‌త లేదంటూ వైసీపీ కౌన్సిల‌ర్ల పిటిష‌న్‌
 • వైసీపీ పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు 


..Read this also
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ వీడియోపై సినీ న‌టుడు పృథ్వీరాజ్‌ స్పంద‌న ఇదే!
 • పార్ల‌మెంటులో తెలుగు ఎంపీల‌కు మంచి చ‌రిత్ర ఉందన్న పృథ్వీ
 • గోరంట్ల వీడియోతో అదంతా తుడిచిపెట్టుకుపోయింద‌ని వ్యాఖ్య‌
 • వీడియోపై గోరంట్ల స్పంద‌న వైసీపీ నేత‌ల‌కు న‌చ్చింద‌ని సెటైర్‌

..Read this also
వైసీపీ నేత క్రాంతికుమార్ రెడ్డి మద్యం తాగి మహిళా ఉద్యోగులను దుర్భాషలాడటం దారుణం: నారా లోకేశ్
 • మ‌హిళా ఉద్యోగుల‌పై వైసీపీ నేత క్రాంతి కుమార్ రెడ్డి దుర్భాష‌లాడార‌న్న లోకేశ్
 • వీడియోను పోస్ట్ చేసిన టీడీపీ అగ్ర నేత‌
 • తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గంగుడుపల్లిలో ఘ‌ట‌న‌
 • రాఖీ సందర్భంగానైనా జగన్ ఆలోచన ధోరణిలో మార్పు రావాల‌ని ఆకాంక్ష‌


More Latest News
Noida Twin Towers Demolition On August 28 Supreme Court Extends Deadline
Sunny Leone daughter Nisha ties rakhis on her brothers wrists
Mega Hero Pawan Tej engagement with Meghana
Stray dog listens to live music at a bar You wonot believe what happened next in viral video
FIFA Officially Advances World Cup By A Day Tournament To Start On November 20
Twitter User Asks Elon Musk About His Social Media Plans
Delhi garbage mountains will take 197 years to clear at current pace
India corona updates
Smoked In Dummy Plane says Influencer After Airline Shared Flight Number
Dwayne Bravo becomes first cricketer to take 600 wickets in T20s
Johnson and Johnson to stop selling talc based baby powder globally in 2023
What freebies does Chief Justice of India get asks RLD chief Jayant Chaudhary
ATM washed away in floods in uttarakhand
Rahul Gandhi Shares pictures with sister priyanka gandhi on the eve of Raksha Bandhan
Video of a man smoking on plane goes viral
..more