తెలంగాణ ఉద్యమంపై బీజేపీ ఫొటో ఎగ్జిబిషన్... ప్రారంభించిన జేపీ నడ్డా
01-07-2022 Fri 21:33
- హెచ్ఐసీసీలో రేపటి నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
- గొల్లకొండ ఎగ్జిబిషన్ పేరిట బీజేపీ తెలంగాణ శాఖ ఫొటో ఎగ్జిబిషన్
- ఉద్యమ చరిత్రను నడ్డాకు వివరించిన లక్ష్మణ్, బండి సంజయ్

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో పార్టీ తెలంగాణ శాఖ గొల్లకొండ ఎగ్జిబిషన్ పేరిట ఓ ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది. తెలంగాణ ఉద్యమం సాగిన తీరు, ఉద్యమంలో పాలుపంచుకుని గుర్తింపునకు నోచుకోని ఉద్యమకారులు, ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమర వీరులకు సంబంధించి వివరాలతో ఈ ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు.
శని, ఆదివారాల్లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాలుపంచుకునే నిమిత్తం శుక్రవారం సాయంత్రానికే హైదరాబాద్ చేరుకున్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ ఎంపీ కె. లక్ష్మణ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు జేపీ నడ్డాకు తెలంగాణ ఉద్యమం గురించి వివరించారు.
More Latest News
రేపు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు... వాహనదారులు ప్రత్యామ్నాయం చూసుకోవాలన్న పోలీసులు
4 hours ago

తెలంగాణలో మరో 476 మందికి కరోనా పాజిటివ్
5 hours ago

తెలంగాణలో ఒక పార్లమెంటు, 4 అసెంబ్లీ నియోజక వర్గాలకు టీడీపీ ఇంచార్జీల నియామకం... జాబితా ఇదిగో
5 hours ago
