సీఎంకే పేరొస్తోంది... ఎమ్మెల్యేల‌కు ఏ పేరూ రావ‌ట్లేదు: వైసీపీ ఎమ్మెల్యే మ‌ద్దిశెట్టి

29-06-2022 Wed 17:57
ysrcp mla maddisetty venugopal comments on bill for government works

ఏపీలో అధికార పార్టీ వైసీపీ జిల్లాలు, నియోజ‌క‌వ‌ర్గాల వారీగా నిర్వ‌హిస్తున్న ప్లీన‌రీల్లో ఆ పార్టీకి చెందిన ప‌లువురు నేత‌లు త‌మ‌లోని ఆవేద‌న‌ను వెళ్ల‌గ‌క్కుతున్నారు. ఇందులో భాగంగా ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి ఎమ్మెల్యే మ‌ద్దిశెట్టి వేణుగోపాల్ బుధ‌వారం ఒంగోలులో జ‌రిగిన జిల్లా ప్లీన‌రీలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బ‌ట‌న్ నొక్కి నిధులు విడుద‌ల చేస్తున్న సీఎం జ‌గ‌న్‌కు మాత్ర‌మే పేరొస్తోంద‌న్న ఆయ‌న‌... ఎమ్మెల్యేల‌కు ఏ పేరూ రావ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

ప్లీన‌రీకి హాజ‌రైన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ చేసిన ప‌నుల‌కు బిల్లులు రాక పార్టీ శ్రేణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని తెలిపారు. బిల్లులు మంజూరు చేసి కార్య‌క‌ర్త‌ల‌ను ప్రోత్స‌హించాల‌ని ఆయ‌న కోరారు. అనంత‌రం మాట్లాడిన మ‌ద్దిశెట్టి వేణుగోపాల్‌.. .ప్ర‌భుత్వ ప‌నులు చేసిన కార్య‌క‌ర్త‌లు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నార‌న్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అప్పులు చేసి బిల్లుల కోసం ఎదురు చూస్తున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. 

ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోనే రూ.100 కోట్ల విలువైన ప‌నులు చేశామ‌ని మ‌ద్దిశెట్టి తెలిపారు. ఆ ప‌నుల‌కు బిల్లులు రాక‌పోవ‌డంతో కార్య‌కర్త‌లు ఇంటి నుంచి బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థితి నెల‌కొంద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వెళితే స‌మ‌స్య‌ల‌పై అడుగుతున్నార‌న్న మ‌ద్దిశెట్టి.. గ‌డ‌ప లోప‌ల ఉన్న వారు బాగున్నార‌ని, గ‌డ‌ప బ‌య‌ట మాత్రం ప‌రిస్థితి బాగా లేద‌ని వ్యాఖ్యానించారు. 

బ‌టన్ నొక్కి డ‌బ్బులు వేస్తుంటే సీఎంకు పేరు వ‌స్తోంద‌న్న ఎమ్మెల్యే.. ఎమ్మెల్యేల‌కు ఏ పేరూ రావ‌డం లేద‌ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. ఈ సంద‌ర్భంగా క‌ల్పించుకున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి.. సీఎం జ‌గ‌న్‌కు కొన్ని ప్రాధాన్యాలు ఉన్నాయ‌ని, స‌మ‌స్య‌ల‌న్నీ త్వ‌ర‌లోనే ప‌రిష్కారం అవుతాయ‌ని స‌ర్ది చెప్పే య‌త్నం చేశారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే టీడీపీకి 125 సీట్లు: మాజీ ఎంపీ రాయ‌పాటి
 • గుంటూరు ఉమ్మ‌డి జిల్లా నేత‌ల‌తో చంద్ర‌బాబు భేటీ
 • వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీదే విజ‌య‌మ‌న్న మాజీ ఎంపీ రాయ‌పాటి
 • టీడీపీ పొత్తుల‌పై చంద్ర‌బాబుదే నిర్ణ‌య‌మ‌ని వ్యాఖ్య‌
 • ఎన్నికల్లో త‌న పోటీపై చంద్ర‌బాబే నిర్ణ‌యం తీసుకుంటార‌ని వెల్ల‌డి

ap7am

..ఇది కూడా చదవండి
సీఎం సొంత జిల్లాను మాఫియా కేంద్రంగా మార్చేశారు: టీడీపీ నేత శ్రీనివాసులు రెడ్డి
 • వైసీపీ నేతలు మైనింగ్, మట్టి, ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారన్న శ్రీనివాసులు రెడ్డి 
 • టీడీపీ ఫిర్యాదుతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని వ్యాఖ్య 
 • అధికారులు కూడా చోద్యం చూస్తున్నారని విమర్శ 

..ఇది కూడా చదవండి
టీడీపీ హయాంలో జాతీయ క్రీడలను ఘనంగా నిర్వహించాం: చంద్రబాబు
 • దేశంలో 36వ జాతీయ క్రీడలు షురూ
 • నిన్న అహ్మదాబాద్ లో ప్రారంభించిన ప్రధాని మోదీ
 • 2002లో ఉమ్మడి ఏపీలో జాతీయ క్రీడలు
 • మస్కట్ గా ఒంగోలు గిత్త 'వీర'ను పెట్టామన్న బాబు 


More Latest News
ap government extends liquor policy for a year
Vijayasai Reddy appeal to Tollywood heroes and producers
A Murali resigns adisor to ap government
Suriya and Ajay Devgan receives national best actor award
new traffic rules in hyderabad soon
Bandla Ganesh requests Pawan Kalyan one chance
Experts says Jaundice may symptom to Pancreatic Cancer
ktr blocked komatireddy rajgopal reddy on twitter
komatireddy raj gopal reddy meets amit shah in delhi
ms dhoni spotted in golf course
Putin annexes Russia with four regions
ed attaches 5551 crores of properties of Xiaomi Technology India Private Limited
andhra pradesh bags 6 awards in implimentation of Ayushman Bharat Digital Mission
India first time in history hosts Moto Grand Prix international bike racing event
bjp leader y satya kumar unaugurates a shopping mall in guntur with ysrcp mlc
..more