ట్విట్టర్ కు తుది నోటీసులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
29-06-2022 Wed 16:15
- తమ ఆదేశాలను పాటించేందుకు జులై 4ను డెడ్ లైన్ గా విధించిన కేంద్రం
- పాటించకపోతే అన్ని కామెంట్లకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిక
- కొన్ని ట్విట్టర్ అకౌంట్లను, ట్వీట్లను తొలగించాలన్న కేంద్రం

గతంలో తామిచ్చిన ఆదేశాలన్నింటినీ జులై 4లోగా పాటించాలని ట్విట్టర్ కు కేంద్ర ప్రభుత్వం తుది నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఫైనల్ నోటీస్ పంపించింది. గడువులోగా నిబంధనలను పాటించకపోతే... ట్విట్టర్ లో పోస్ట్ అయిన అన్ని కామెంట్లకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
అంతర్జాతీయ న్యాయవాద గ్రూప్ ఫ్రీడమ్ హౌస్, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, రైతుల నిరసనకు సంబంధించిన ట్విట్టర్ అకౌంట్లను, కొన్ని ట్వీట్లను తొలగించాలని ట్విట్టర్ ను కేంద్ర ప్రభుత్వం గతంలో కోరింది. ఈ క్రమంలో జూన్ 26న తాము బ్లాక్ చేసిన 80కి పైగా ట్విట్టర్ అకౌంట్లు, ట్వీట్ల జాబితాను కేంద్రానికి ట్విట్టర్ అందించింది. అయినప్పటికీ తాము చేసిన ఆదేశాల్లో ఇంకా పాటించాల్సినవి చాలా ఉన్నాయని... వాటన్నింటినీ జులై 4లోగా పాటించాలంటూ కేంద్రం చివరి నోటీసును జారీ చేసింది.
More Latest News
తెలంగాణలో తాజాగా 406 కరోనా కేసులు
8 hours ago

పవన్ కల్యాణ్ కు ఓటేస్తే చంద్రబాబుకు ఓటేసినట్టేనని కాపులకు అర్థమైంది: మంత్రి దాడిశెట్టి రాజా
9 hours ago

ఆనందం కంటే బాధే ఎక్కువగా ఉంది: అనుపమ పరమేశ్వరన్
10 hours ago

మంకీ పాక్స్ పేరు మారుస్తాం.. కొత్త పేరు సూచించాలని ప్రజలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ విజ్ఞప్తి
11 hours ago

చిరూ బర్త్ డేకి భారీ సందడి!
11 hours ago
