కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో హరీశ్ రావు భేటీ
29-06-2022 Wed 15:40
- జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల కోసం చండీగఢ్ వెళ్లిన హరీశ్ రావు
- మర్యాదపూర్వకంగానే నిర్మలతో భేటీ
- తెలంగాణ అంశాలేవీ చర్చకు రాని వైనం

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో టీఆర్ఎస్ కీలక నేత, తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు బుధవారం భేటీ అయ్యారు. జీఎస్డీ కౌన్సిల్ సమావేశాల్లో పాలుపంచుకునే నిమిత్తం బుధవారం చండీగఢ్ వెళ్లిన హరీశ్ రావు మర్యాదపూర్వకంగానే సీతారామన్‌తో భేటీ అయినట్లు సమాచారం. ఈ భేటీలో తెలంగాణకు చెందిన అంశాలేమీ కూడా ప్రస్తావనకు రాలేదని సమాచారం.
కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపేణా తెలంగాణ చెల్లించిన మొత్తం.. రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణకు కేంద్రం విడుదల చేసిన నిధులపై బీజేపీ, టీఆర్ఎస్ల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం నేపథ్యంలో నిర్మల, హరీశ్‌ల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. తనతో హరీశ్ రావు భేటీ అయిన విషయాన్ని నిర్మల కార్యాలయమే వెల్లడించింది.
More Latest News
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను పరామర్శించిన సీఎం జగన్ దంపతులు
4 hours ago

వీల్ చెయిర్ లో ఉండి కూడా ఆనంద పారవశ్యంతో డ్యాన్స్ చేసిన రాకేశ్ ఝున్ ఝున్ వాలా... వీడియో ఇదిగో!
5 hours ago

మనందరికీ ఏదో ఒక ఉమ్మడి అంశం ఉంటుంది... అదే మనందరినీ ఒకటిగా కలుపుతుంది: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
6 hours ago

మంత్రిత్వ శాఖలు కేటాయించిన మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే... ఫడ్నవీస్ కు హోం, ఆర్థిక శాఖలు
6 hours ago
