టాలీవుడ్లో మరో విషాదం.. ప్రముఖ నటి మీనా భర్త మృతి
29-06-2022 Wed 06:34
- జనవరిలో కరోనా బారినపడిన మీనా కుటుంబం
- గత కొన్నాళ్లుగా ఆసుపత్రిలో చికిత్స
- పరిస్థితి విషమించడంతో గత రాత్రి కన్నుమూత
- నేడు చెన్నైలో అంత్యక్రియలు

టాలీవుడ్ ప్రముఖ నటి మీనా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యం బారినపడి గత కొన్ని నెలలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె భర్త విద్యాసాగర్ (48) గత రాత్రి చెన్నైలో మృతి చెందారు. బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన విద్యాసాగర్‌ను 2009లో మీనా వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమార్తె ఉంది.
జనవరిలో మీనా కుటుంబం కరోనా బారినపడింది. ఆ తర్వాత వారు కోలుకున్నప్పటికీ విద్యాసాగర్ మాత్రం కోలుకోలేకపోయారు. అది మరింత తీవ్రం కావడంతో చెన్నైలోని ఆసుపత్రిలో చేర్చారు. అంతలోనే ఆయన ఆరోగ్యం విషమించడంతో గత రాత్రి కన్నుమూశారు. విద్యాసాగర్ మరణవార్త తెలిసి తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. విషయం తెలిసిన సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. విద్యాసాగర్ అంత్యక్రియలు నేడు చెన్నైలో జరగనున్నాయి.
More Latest News
తెలుగు మహిళలు, తెలుగు యువత, తెలుగు వృద్ధులంతా కలిసి వచ్చినా వైసీపీని ఏమీ చేయలేరు: కొడాలి నాని
7 hours ago

కొండపల్లి నగర పంచాయతీలో కేశినేని ఓటు హక్కు వినియోగంపై పిల్‌కు విచారణ అర్హత ఉంది: ఏపీ హైకోర్టు
8 hours ago

'మాచర్ల'తో నా ముచ్చట తీరింది: నితిన్
9 hours ago

'లైగర్' మూడో సాంగ్ ముహూర్తం రేపే!
9 hours ago

బాలకృష్ణ 108వ సినిమా ప్రకటన వచ్చేసింది!
10 hours ago

వైసీపీ నేత క్రాంతికుమార్ రెడ్డి మద్యం తాగి మహిళా ఉద్యోగులను దుర్భాషలాడటం దారుణం: నారా లోకేశ్
10 hours ago

'కృష్ణ వ్రింద విహారి' రిలీజ్ డేట్ ఖరారు!
11 hours ago

వెంకయ్యను వినోబా భావేతో పోల్చిన ప్రధాని మోదీ
11 hours ago
