పారిస్ బయలుదేరిన ఏపీ సీఎం జగన్... జులై 3న తిరిగి రాక
28-06-2022 Tue 19:55
- కూతురు కళాశాల స్నాతకోత్సవం కోసం పారిస్కు జగన్
- ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఏపీ సీఎం
- జగన్కు వీడ్కోలు పలికిన పలువురు మంత్రులు

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం రాత్రి ఫ్రాన్స్ రాజధాని పారిస్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఆయన ప్రత్యేక విమానంలో పారిస్ బయలుదేరారు. ఈ సందర్భంగా జగన్కు ఆయన కేబినెట్లోని పలువురు మంత్రులు వీడ్కోలు పలికారు.
పారిస్లో చదువుతున్న తన కూతురు కళాశాల స్నాతకోత్సవానికి జగన్ వెళుతున్న సంగతి తెలిసిందే. ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్... తన పారిస్ టూర్కు అనుమతించాలని పిటిషన్ దాఖలు చేసి నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు నుంచి అనుమతి తీసుకున్న సంగతి తెలిసిందే. పారిస్లో పర్యటించేందుకు జగన్కు 10 రోజుల పాటు కోర్టు అనుమతించింది. ఈ పర్యటన ముగించుకుని జగన్ జులై 3న తిరిగి రానున్నారు.
More Latest News
మరోమారు కరోనా బారిన పడ్డ సోనియా గాంధీ
4 minutes ago

రేవంత్ రెడ్డికి కరోనా.. మునుగోడు పాదయాత్రకు దూరం
11 minutes ago

73 బంతుల్లో శతక్కొట్టిన పుజారా.. ఎక్కడంటే..!
46 minutes ago

కృతి శెట్టికి టెన్షన్ మొదలైనట్టే!
57 minutes ago

ఇక మాస్కులు ధరించక్కర్లేదంటున్న ఉత్తర కొరియా
1 hour ago

భారీ ఫ్లాప్ తప్పించుకున్న విజయ్ సేతుపతి
2 hours ago

రజనీకాంత్ సరసన ఛాన్స్ కొట్టేసిన తమన్నా!
2 hours ago
