ధర్మవరం ప్రెస్ క్లబ్ లో బీజేపీ నేతలపై దాడి
28-06-2022 Tue 17:51
- వైసీపీ ప్లీనరీలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలు
- నిరసనగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన గోనుగుంట్ల
- కర్రలు, రాడ్లతో వచ్చిన కొందరు వ్యక్తులు
- బీజేపీ శ్రేణులపై దాడి
- ఆసుపత్రిపాలైన బీజేపీ కార్యకర్తలు

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో బీజేపీ నేతలపై దాడి జరిగింది. వైసీపీ ప్లీనరీలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ మాజీ శాసనసభ్యుడు గోనుగుంట్ల సూర్యనారాయణ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, కొందరు వ్యక్తులు మూడు వాహనాల్లో అక్కడికి చేరుకుని బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. కర్రలు, రాడ్లతో దాడి చేసినట్టు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది.
ఈ దాడిలో బీజేపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. కాగా, బీజేపీ శ్రేణులపై దాడికి దిగిన వారిని అరెస్ట్ చేయాలంటూ బీజేపీ కార్యకర్తలు రోడ్డుపై నిరసనకు దిగారు. ధర్మవరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
More Latest News
సరికొత్త హెయిర్ స్టయిల్ తో మహేశ్ బాబు... ఫొటో ఇదిగో!
20 minutes ago

ప్రపంచంలో 4 వేల పులులు ఉన్నాయి.. కానీ రాహుల్ ద్రావిడ్ ఒక్కడే: న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్
20 minutes ago

విజయనగరం జిల్లాలో దొరికిన లాకర్ లో నాణేలు తప్ప ఏమీ లేవు!
39 minutes ago

ఇంతటి భిన్నత్వంలోనూ సమర్థంగా నెట్టుకువస్తున్న భారత్ వైపు యావత్ ప్రపంచం చూస్తోంది: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
59 minutes ago

ఢిల్లీ రోడ్డుపై బిచ్చగాడు... పెద్ద మోడల్ లా ఉన్నాడు.. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఇదిగో!
1 hour ago

వీఎల్ సీ మీడియా ప్లేయర్ పై దేశంలో నిషేధం
2 hours ago

‘వారు దేశ విభజన సమయంలో దృఢంగా నిలబడ్డారు..’ నాటి హింసలో చనిపోయినవారికి ప్రధాని మోదీ నివాళులు
2 hours ago
