ఏపీ ఎంసెట్ (ఈఏపీ సెట్) హాల్ టికెట్ల డౌన్ లోడ్ వివరాలు ఇవిగో!

28-06-2022 Tue 17:31
AP EAMCET hall tickets released

ఏపీలో జులై 4 నుంచి 12వ తేదీ వరకు ఎంసెట్ (ఈఏపీ సెట్) పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో, నిన్న (జూన్ 27) హాల్ టికెట్లు విడుదల చేశారు. వాస్తవానికి ఎంసెట్ హాల్ టికెట్లు నిన్న సాయంత్రం విడుదల అవుతాయని భావించగా, మధ్యాహ్నం నాటికే హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహిస్తున్న ఈఏపీ సెట్ కు గత ఏప్రిల్ 11న నోటిఫికేషన్ వెలువడింది.

కాగా, హాల్ టికెట్లను cets.apsche.ap.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. హోమ్ పేజీలో డౌన్ లోడ్ ఏపీ ఈఏపీసెట్ 2022 హాల్ టికెట్ అన్న లింక్ పై క్లిక్ చేయాలి. ఆపై అప్లికేషన్ నెంబరు, ఇతర వివరాలను నింపాలి. దాంతో స్క్రీన్ పై హాల్ టికెట్ దర్శనమిస్తుంది. దాన్ని డౌన్ లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది. 

ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు జులై 4 నుంచి 8 వరకు.... అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు జులై 11, 12 తేదీల్లో నిర్వహించనున్నారు. ఆగస్టు 15న ఎంసెట్ పరీక్ష ఫలితాలు వెల్లడించనున్నారు.

..Read this also
విజయనగరం జిల్లాలో దొరికిన లాకర్ లో నాణేలు తప్ప ఏమీ లేవు!
  • రాజాంలో పాత ఇంట్లో ఇనుప లాకర్ లభ్యం
  • యజమాని, కూలీల మధ్య వాగ్వాదం
  • లాకర్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు
  • పోలీసుల సమక్షంలో లాకర్ తెరిచిన వైనం


..Read this also
రొంపిచర్లలో వృద్ధురాలిపై అత్యాచారం.. ఆపై హత్య
  • విప్పర్లలో ఆరుబయట నిద్రించిన వృద్ధురాలు
  • సమీపంలోనే ఉండే వ్యక్తి ఇంట్లోకి వెళ్లిన జాగిలాలు
  • నేరాన్ని అంగీకరించిన యువకుడు

..Read this also
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
  • నేడు వాయుగుండంగా బలపడే అవకాశం
  • ఏపీ, యానాంలో పడమర గాలుల ప్రభావం
  • ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ


More Latest News
Mahesh Babu with new hairstyle
There are 4 thousand tigers but Rahul Dravid is only one New Zealand cricketer Ross Taylor
Only coins has been found in old iron locker
Mohan Bhagwat comments on diversity
Suspected bank robber rescued in Rome after tunnel collapse
Modi and Chandrababu condolences to the demise of Rakesh Jhunjhunwala
Photo of delhi beggar looking like a model
anasuya bharadwaj revealed reasons behind Jabardasth exit
VLC Media Player banned and blocked in India
Man slits wifes throat at family court in karnataka
minister Mallareddy key aide join in to BJP
tirumala piligrims crowd
PM Modi pays homage to those who lost their lives during partition
Rakesh Jhunjhunwala successfull stocks journey Investor
14092 new covid cases 41 deaths in india
..more