విమానం కాదు ‘బాహుబలి’ హోటల్​.. ప్రపంచమంతా తిరుగుతూ ఎంజాయ్​ చేయొచ్చు!

28-06-2022 Tue 16:03
nuclear powered hotel that never lands set to fly 5000 guests

ఓ క్రూయిజ్ షిప్ తరహాలో వందల క్యాబిన్లు.. అందులోనే సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, గేమింగ్ జోన్లు, షాపింగ్ సౌకర్యాలు.. అద్దాలతో కూడిన బాల్కనీలు.. అబ్బో అనిపించేలా సౌకర్యాలు.. మరి ఇవన్నీ ఉండేది ఓ విమానంలో అయితే.. భలే చిత్రంగా ఉంది కదా. యెమెన్ కు చెందిన ప్రమేఖ సైన్స్ ఇంజనీర్ హషీమ్ అల్ ఘాయిలీ దీనిని డిజైన్ చేశారు. దీనికి సంబంధించి ఓ గ్రాఫిక్స్ వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడా వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పెద్ద సంఖ్యలో షేర్లు, లైక్లు వస్తున్నాయి. 

పేరు ‘స్కై క్రూయిజ్’

విమానంలా గాల్లో ఎగురుతూనే.. అత్యంత విలాస వంతమైన క్రూయిజ్ షిప్ లలో ఉండే సకల సౌకర్యాలను అందించే ఈ సరికొత్త హోటల్ కు ‘స్కై క్రూయిజ్‌’ అని పేరు పెట్టారు. ఏక కాలంలో ఐదు వేల మంది ప్రయాణించడానికి వీలుగా ఉండటంతో దీన్ని ‘బాహుబలి’ హోటల్ గా అభివర్ణిస్తున్నారు. అంతేకాదు ఈ విమానం ఆకాశంలో ఏళ్ల తరబడి నిరంతరాయంగా ఎగరగలుగుతుందని డిజైనర్ చెప్తున్నారు.

ఇందుకోసం అణు ఇంధనంతో నడిచే 20 ప్రత్యేక ఇంజన్లను వినియోగించాల్సి ఉంటుందని.. చిన్నపాటి అణు రియాక్టర్‌ ను వినియోగిస్తే సరిపోతుందని అంటున్నారు. ప్రయాణికులు, సరుకులను చిన్న విమానాల ద్వారా ఈ భారీ విమానంలోకి చేరుస్తారట. ఏమైనా ఎమర్జెన్సీ వస్తే ప్రయోజనం ఉండేలా ఓ ఆస్పత్రి కూడా ఉంటుందని చెప్తున్నారు.

ఈ విమానంలో భారీ షాపింగ్‌ మాల్‌, రెస్టారెంట్లు, ప్లేగ్రౌండ్లు, బార్లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్‌ పూల్ వంటివి ఉంటాయని డిజైనర్ చెప్పారు. ఇక విమానం తోక భాగంలో ఉండే భారీ డెక్‌ నుంచి 360 డిగ్రీల కోణంలో చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వీక్షించవచ్చని వివరించారు. విమానం మధ్య లోపలికి వెలుతురు ప్రసరించేలా అద్దాలను అమర్చనున్నారు.

..Read this also
అంతరిక్షంలో విష్ణు చక్రం.. చిత్రమైన గెలాక్సీని గుర్తించిన నాసా శాస్త్రవేత్తలు!
  • భూమికి 50 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో గుర్తింపు
  • జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సాయంతో పరిశీలించిన శాస్త్రవేత్తలు
  • ఓ పెద్ద గెలాక్సీ, మరో చిన్న గెలాక్సీ ఢీకొనడంతో ఈ ‘రింగ్’ గెలాక్సీ ఉద్భవించినట్టు వెల్లడి


..Read this also
24 గంటల కంటే తక్కువ సమయంలోనే తన చుట్టూ తాను తిరిగిన భూమి... సరికొత్త రికార్డు
  • వేగం పుంజుకున్న భూమి
  • జులై 29న ఘటన
  • 1.59 మిల్లీసెకన్ల తేడాతో భ్రమణం పూర్తి
  • 1960 నాటి రికార్డు తెరమరుగు

..Read this also
గడియారాన్ని చూసినప్పుడు తొలి సెకన్​ లేటుగా కదులుతుంది.. అందుకు కారణమిదే..!
  • కళ్లు కదిలే విధానంలో రెండు రకాలు.. దృష్టి వేగాన్ని బట్టి మెదడు ప్రాసెసింగ్
  • వేగంగా కళ్లు కదిలే విధానంలో దృశ్యాన్ని భిన్నంగా చూపే మెదడు
  • కదిలే వస్తువులపైకి ఒక్కసారిగా దృష్టి మరల్చినప్పుడు.. ఆలస్యమైనట్టు కనిపిస్తుందన్న నిపుణులు


More Latest News
Poorna reacts to marriage cancel speculations
RBI divides digital lending entities into three categories
ysrcpp leader vijay sai reddy lauded venkaiah naidu as vice president of inida
Harika Dronavalli wins bronze medal in chess olympiad with 9 months pregnancy
Center approves Corbevax as booster dose
jeevan reddy meets kcr in pragathi bhavan
Mexico president wants a commission includinh Indian PM Modi
Telangana corona media report
Vijayasai Reddy opines in Cricket issues
union minister jaishankar visited hyderabad Regional Passport Office
RS 50k crore saved by blending ethanol with petrol says PM Modi
ysrcp Official Spokesperson Nagarjuna Yadav tweets with nara lokesh old photos
Death Valley witnessed rainfall and flash floods
ktr congratulates bihar new deputy cm tejashwi yadav
..more